పుట:Chandragupta-Chakravarti.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6]

నాలుగవ ప్రకరణము

41


పురుషోత్తమ పదద్యోతక మని మఱికొందఱును వ్రాసి యున్నారు. అప్పటి పౌరవరాజు హూణుఁడగు నలెగ్జాండరును జీలము నదియొద్ద తన చతురంగసేనతో నెదురించెను. ప్రస్తుతము చిలియాన్ వాలా యనఁబడు మైదానమునకుఁ బశ్చిమమునఁ బదునాల్గుమైళ్ళ దూరమున నదియొడ్డున ఘోరమైన పోరుగలిగె. ఇంటిగుట్టు లంకకుఁ జేటన్నట్టు లీ యుద్ధములోఁ దక్షశిలా రాజులు తమ స్వదేశస్థుఁడగు పురుషోత్తమునికి సాహాయ్యము చేయుటకు మాఱుగ దేశఘ్నులై తమ సైన్యముతో నలెగ్జాండరు పక్షమునఁ బోరిరి. అందువలనను, బురుషోత్తముని రధంబులు నదియొడ్డు బురదలో దిగఁబడినందునను అతని యేనుంగులు తిరుగఁబడి యతని సైన్యమునే నాశనము చేసినందునను అలెగ్జాండరు సైన్యములు పురుపోత్తముని సైన్యములకంటె నెక్కుడుగా నున్నందునను, అతనికిఁ బరాభవము గలిగి యలెగ్జాండరునకే జయము గలిగెను.

అలెగ్జాండరు పంజాబు దేశములోను, సింధు దేశములోను, రెండు సంవత్సరముల కాలముండెను. అంతలో నుత్తర పంజాబులోని తక్షశిల ( డేరిషహాన్ ), నికాయా (మాంగ్), దక్షిణ పంజాబులోని అలెగ్జాండ్రియా, ( వుచ్), సింధు దేశములోని పాటల ( హైదరాబాద్ ), అను స్థలముల రాజులను దనకు నంకితులఁ జేసికొనియెను. తన సైన్యములోఁ గొంతభాగ మచ్చటచ్చట నుంచెను.

ఆతనికి హిందూ దేశమంతయు జయింపవలెనను కోర్కె యుండెను గాని యతని సైన్యములు బియాస్‌నది దాఁటుటకు