పుట:Chandragupta-Chakravarti.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

చంద్రగుప్త చక్రవర్తి


సమ్మతింపక తిరుగఁబడినందున నాతఁడు క్రీ. పూ. 325 లో మరలి పోవలసినవాఁ డాయెను. తాను పంజాబు దేశములో సంపాదించిన రాజ్యమును కాపాడుటకు నధికారుల నియమించి వెళ్ళెను.

చంద్రగుప్తుఁ డలెగ్జాండరును జూచుట

ఇట్లు మన కథానాయకుడగు చంద్రగుప్తుఁడు చిన్న వయస్సులో నుండఁగా పంజూబు దేశమంతయు గ్రీకుదేశస్థులచే నాక్రమింపఁబడియె. నందవైరము కారణముగ చంద్రగుప్తుడు పాటలీ పురమునుండి పలాయితుఁడై పంజాబు ప్రాంతమున దిరుగుచు నలెగ్జాండరుని దండుఁజొచ్చి యాతని దర్శించునట్లును నందులు సర్వజన విరోధులుగావున వారినోడఁగొట్టి మగధము నాక్రమించుట మహాసులభ కార్యమని గ్రీకు యోధశ్రేష్ఠునకు నేష్య భారత చక్రవర్తి మంత్రోపదేశ మొసఁగినట్లును, యేదో యొక కారణమువలన అలెగ్జాండరునకు. చంద్రగుప్తునిపై నాగ్రహముప్పతిల్లి యతనిని బట్ట నాజ్ఞయిడ నతఁడు పర్వత ప్రాంతము లోనికిఁ బారిపోయినట్లును ఫ్లూటార్‌కు వ్రాసి యున్నాఁడు. ఈ మాటయే నిజమైన యెడల చంద్రగుప్తుఁ డిరువదియైదేండ్ల వయస్సును మించనివాఁడుగా నున్నప్పుడు అలెగ్జాండరు. మన దేశము మీఁదికి దండెత్తి వచ్చెనని మన మూహింపవచ్చును. గాని అలెగ్జాండరుతో నీతనికిఁ భోరేల కలిగెనో మన మూహింపలేకున్నాము,

మూడులక్షల సైన్యపు వ్యూహములను మగధాధీశుని యేకచ్ఛత్రాధిపత్యమును, మహాపద్ముని ధనజనాదివై భవము