పుట:Chandragupta-Chakravarti.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

చంద్రగుప్త చక్రవర్తి

 బుద్ధునివలె క్షత్రియకులస్థుడు. అతని తండ్రి మయూర దేశాధిపుఁడు. ఆ రాజు రాజ్య మేలుచుండ పగతు రితని దేశముపై దాడి వెడలివచ్చి యుద్ధమునం దితని నోడించి సంహరించిరి. అట్టి విపత్తుసమయమున మన చంద్రగుప్తుని గర్భమందు గాంచియున్న మయూరరాణి ఒక పశువుల కొట్టమునకు చేరువ నా బిడ్డను కని విడిచిపోయెను, అంత నొక గొల్లఁడు బిడ్డను పెంచి, పాటలీపురమున నొకనాడు వెడల దటస్థించి యచ్చట తక్షశిలా బ్రాహ్మణుడగు చాణక్యున కమ్మివేసినట. ధననందుడు చాణక్యుని అవమానపఱచి నందున, చంద్రగుప్తుని నిమిత్తీకరించుకొని పగదీర్చుకొనెనట.

మఱియొక వృత్తాంతము చొప్పున మోరియ అనగ మయూరనగరవు రాణి, స్వభర్తసంహారము కాఁగనే గర్భార్భకుని కాపాడుటకై , తన యన్నను దోడ్కొ ని వుష్పపురికి పరుగెత్తి పోయెనట. అచ్చట మాఱువేషము దాల్చి బ్రతుకు చుండ కుమారుని గాంచెను. దేవతలు రక్షింతురుగాతమని యా శిశువును ఒక జాడీలోఁబెట్టి పసుల కొట్టపు గుమ్మమున నుంచిపోయె. అప్పుడు చణ్దుడన్న ఒక యెద్దు జాడి యొద్ద నిలిచి బిడ్డను కాపాడుచున్నందున అచ్చటి పశువులకాపరి వానికి చండగుప్తుడని పేరుపెట్టి కాపాడెను, చండగుప్త నామము చంద్రగుప్తనామముగా మాఱిపోయెనట. మోరీయులు పిప్పలి వనమున నున్నవారని బౌద్ధజైనుల వార్తగా నున్నది. స్వాటు పల్లపు సీమయందు నేటికిని . “ మోరా ' యని యొక కనుమ