పుట:Chandragupta-Chakravarti.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

21


యున్నదని వాడ్డెలుగారు నుడువుచు ఈనామము చంద్రగుప్తుని ఔత్తర జన్మమును సూచించు చున్నదనుచున్నారు.

బౌద్ధచరిత్రములు గ్రీకు ఇతిహాసములతో మిక్కిలి సమరస పడియున్నవి. ముఖ్యాంశముల కథనమునందు వ్యత్యాసము లగుపడవు. మరికొన్ని బౌద్ధ గ్రంథములలో నిట్లున్నది :-

చాణక్యుడు గొల్లవానికి క్రయంబిచ్చి చంద్రగుప్తుని తీసికొని అతనికి యుక్తమైన క్షాత్రవిద్యాభ్యాసము జేయించెను. చంద్రగుప్తుడు యౌవనము బొందగనే, తనయొద్ద రహస్యముగ వేతనంబిచ్చి యుంచియున్న సేనను అతని వశముజేయ నతడు పాటలీపురముపై దాడి వెడలెను. కాని యీ తిరుగుబాటు వ్యర్థమాయెను. కావున చంద్రగుప్తుడు పంజాబునకు బాఱిపొయెను.

మఱియొక కథ గలదు. చాణక్యుడు తన చేతనున్న దొంగ కాహపణములతో సేనను గూర్చికొని నందునిపై దాడి వెడలగ మొదట నపజయము బొందెను. అంత చంద్రగుప్తుని బిలిచి "యుద్ధమువల్ల లాభము లేదు. గుప్తాచారులమై జనుల యభిప్రాయములను మొదట దెలిసి కొందము" అని చెప్పి వా రిరువురు గ్రామములో గుప్తచారులై దిరుగుచుండిరి. ఒక దినమొక పిల్లవాడు తల్లి తనకొక రొట్టె నియ్యగా దాని నదిమి భాగముమాత్రము తిని చుట్టునున్న భాగము వదలిపెట్టి మఱియొక రొట్టె నడుగగా తల్లి "ఓరి పిచ్చివాడా! చుట్టు నున్న రాజ్యమును ముందు వశపరచుకొనకయే మొట్ట