పుట:Chandragupta-Chakravarti.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

19


విరోధమును విశదీకరించి శరణము వేడెను. వెంటనే చాణక్యుడతని నోదార్చి సర్వ నందరాజ్యమునకును పట్టాభిషేక మతనికి జేయించునట్లు "రెండవ ప్రతిజ్ఞయు జేసెను. మౌర్యచంద్రుని తన యండ జేర్చుకొని యా కుటిలుడు నందకుల నిర్మూలనోపాయమును, పన్నెను. తన మిత్రుఁ డిందుశర్మకు క్షపణక వేషము వేసి, యా యభిచారికావేత్తతో రాక్షసాదుల వంచించుచు, నందరాజ్యార్ధమును బహుమతిగా వాగ్దానము చేసి మహాబలిష్టుడైన పర్వతేంద్రుని సాహాయ్యముగా జేర్చుకొని మ్లేచ్చబలములతో కుసుమపురిని ముట్టడించెను. నందులును సంరబ్ధులై మంత్రి రాక్షస వీర్యదృప్తులై యుద్ధమునకు సమకట్టిరి. పలు తెఱంగుల ప్రయత్నించియు, నా బలమును జయింప నశక్తుడై రాక్షసుడు ఛద్మమున చంద్రగుప్తుని సంహరింప నుద్యమించెను.

కాని సర్వనందులును పర్వతేంద్ర బలానిలముతో చెలరేగింపబడిన చాణక్య క్రోధానలంబున శలభంబుల మాడ్కి సందగ్ధులైరి. పిదప రాక్షసుడు క్లేశపరవశుఁడై, బల పౌరుష నష్టుడై, అరిబలాక్రాంతమైన సేనలసాహాయ్యము గోలుపోయిన వాడై , ప్రాణ త్రాణ పరాయణుడై , నందవృద్ధుడైన సర్వార్ధ సిద్దిని సురంగమార్గమున పురమునుండి బయలుపంపి, నంద పక్షపాతులగు పౌరులతో పురమును మౌర్యువశము పఱిచెను.

బౌద్ధ గ్రంథములందలి కథ

బౌద్దులు చెప్పుటేమనగ, చంద్రగుప్తుడు శాక్యవంశ సంభూతుడు. కాన నితడు శాక్యసింహుడని వాడబడు గౌతమ