పుట:Chandragupta-Chakravarti.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

చంద్రగుప్త చక్రవర్తి


సెల్యూకసు

అలెగ్జాండరుచేఁ జయింపఁబడి కొంతకాల మాతని పాలనకు లోనయియుండి ఆతని మరణానంతరము చెల్లాచెదరయి పోయియుండిన రాజ్యశకలములను, జంద్రగుప్తుఁడు భరతఖండమును ఏకచ్ఛత్రాధిపత్యము గ్రిందికిఁ దెచ్చుచుండిన కాలముననే, ఏకచ్ఛత్రాధిపత్యమునకుఁ దేఁ బ్రయత్నించి జయము వడసి చంద్రగుప్తుని నెదిర్చి నిలువలేక అతనికిఁ బుత్రికనిచ్చి మైత్రిచేసికొనిన మహావీరుఁడు ఈ సెల్యూకసు.

ఇతఁడు క్రీ. పూ. 358-354ల మధ్యకాలమున జనన మందెను. ఇతఁడు రమారమి ముప్పదిసంవత్సరముల వాఁడయి ఆసియా మీఁది కెత్తి పోవనున్న అలెగ్జాండరు సైన్యమునఁ జేరువఱకుంగల ఇతని జీవిత చరిత్రము మనమెఱుంగము. క్రీ. పూ. 326.వ సంవత్సరమున నితఁ డలెగ్జాండరు సైన్యములోని ముఖ్యాధికారులలో నొక్కఁడయి కన్పట్టుచున్నాఁడు. ఆప్గఘనిస్థాన ప్రాంతము నందలి పర్వతప్రదేశమున నలకసుందరుని బ్రీతుంజేయుటచేత నతనికడఁ బ్రధానాధికారిగ నేమింప బడెను. అలెగ్జాండరు, టాలమీ, పర్డిక్కాసు, లాసిమేకసులతో భరతవర్షముంజొచ్చి పురుషోత్తముతోడి పోరున నితఁడు పేరు మగండయి . వెలసె. అందువలన నలకసుందరున కీతనిపయి ననురాగము చెన్నువహించి నట్లగుపించుచున్నది. సూసాపట్టణమున క్రీ. పూ. 324 వ సంనత్సరమున జరిగిన మహావైభవోపేత వివాహములలో నలెగ్జాండరు వివాహమునకు