పుట:Chandragupta-Chakravarti.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21]

పదియవ ప్రకరణము

161


రెండవ దీతనిదె యయి యొప్పెను. పారసీక ప్రభువులలో నలెగ్జాండరు మామయు నీతని మామయు సమానౌన్నత్యము గల ప్రముఖులు.

బేబిలోనున క్రీ. పూ. 323 లో నలెగ్జాండరు పరలోక గతుఁడయిన పిదప నాతని రాజ్యమంతయు నరాజకముగాఁ జొచ్చెను. ఫ్రిజియాక్షత్రపుఁడగు అంటిగోనసును, ఫిలిపుసేనానియగు ఆన్టిపేటరును. ఈజిప్టుక్షత్రపుఁడగు టాలిమీయును, మెకడోనియా ప్రతినిధియగు క్రెటరసును స్వతంత్రరాజులము గాఁగలుగుదుము గదాయని పన్నుగడలకు ప్రారంభించిరి, కొలఁది కాలముననే రోక్సానాకు కొమరుండుపుట్టె. పర్డిక్కాసు ఆ చిన్ని యలెగ్జాండరునకు సహపాలకుఁ డయ్యెను. ఇతర క్షత్రపులతోఁ జేరియుండిన సెల్యూకసునకును వెన్వెంటనే రాజ్యభాగ మబ్బియుండునుగాని ఏ కారణముననో అతఁడు సహపాలకుని రక్షక సైన్యమున (Companions) కధ్యక్షుఁడుగ నుండనియ్యకొనెను. అయిన నిది బహుకాలము జరిగినదిగాదు. క్రీ. పూ. 321 లో ఆన్టిగోనసు సహపాలకుని యాజ్ఞ నుల్లంఘించుటంజేసి వీ రిద్దఱకును విగ్రహము ప్రారంభ మాయెను. క్షత్రపు లందఱును ఆన్టిగోనసుతోఁ జేరిరి. పర్డిక్కాసు విగ్రహమును నడుపుచు సైన్యముతో నీజీప్తుఁ జొచ్చెను. అతని సైన్యము లోడిపోయి యతఁడు ప్రాణము లర్పింపవలసి వచ్చెను. బహుకాలముగ సంగతులను గమనించుచుండిన "సెల్యూకసు సమయము చూచుకొని సహపాలకుని దిగనాడి క్షత్రవుల పక్షముసఁ జేరిపోయెను. .