పుట:Chandragupta-Chakravarti.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

159


నీటివైపునఁ జూచుచుండిరి. అది గమనించి అతఁడు "నేనుదకమును ద్రావినయెడల నావలెనే పిసాసాపీడితులగు నీ సైనికులు అధైర్యపడియెదరు" అనుచు నీటిని వెనుకకు నిచ్చివేసెను. అతని యౌదార్యమునకుసు త్యాగమునకును మెచ్చి సైన్య మెల్లయు నొక్క పెట్టున మిక్కిలి తెగువతో ద్రోవనడచెను.

అలెగ్జాండరు భరతవర్షముమీదికి దండెత్తి వచ్చుట మున్నగు విషయములు నాలుగవ ప్రకరణమున వ్రాయఁబడినవి. మరల నిచ్చట వ్రాయుట అనవసరము. -

డెరయసు మరణానంతరము అలెగ్జాండరు దనరాజ్యము నందు సంబంధములును బాంధవ్యములును నుండిన రాజ్యస్తైర్యమున కనుకూలమగునని తలఁచి పౌరవాత్య పద్దతులను అవలంబింప మొదలిడెను. భరతవర్షమునుండి తిరిగి పోవుచు సూసాపట్టణముకడ మహావైభవమున రోక్సానా యను పారసీక కన్యను జేపట్టి పెండ్లియాడెను. తన మిత్రులకును బంధువులకును గ్రింది యధికారులకును అనేకులకుఁ బూర్వదేశముల యందలి కన్యలను వివాహమున నిప్పించెను. 9000 వివాహములు జరిగెను. తాను ఉడుపులు మున్నగు ఇతర విషయములను గూడ పౌరవాత్యపద్ధతులనే అనుసరించుచు వచ్చెను.

భరతవర్షమునుండి దిరిగిపోవుచు నతఁడు బాబిలోను వద్దకు వెళ్లునప్పటి కాతనికిఁ జలిజ్వరము సంభవించి మృతుఁ డయ్యెను. ( క్రీ. పూ. 323)

అలెగ్జాండరు అంతిమదశయందు విశేషము త్రాగుడు వలన కొందఱను అన్యాయముగ జంపినట్లు చెప్పఁబడుచున్నది. ఎట్టివారికిని గళంకము లుండును గదా!