పుట:Chandragupta-Chakravarti.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

147

రాక్షసుని భేదించుటకు తానాలోచించినపుడెల్ల వీర రసంబగు ఆత్మశ్లాఘనవచనంబుల నేకాంతమునన భాషించినవాఁ డైనను రాక్షసమిత్రంబగు చందనదాసుని యెదుట “అస్యచ్చ, నందమివ విష్ణుగుప్త" అనుచు ఆత్మస్తుతి విషయముగ అర్ధోక్తి యందు లజ్జను నటించుటయు "సర్వంమే. — అని యర్ధోక్తి యందు లజ్జను నటించుచు (వృషలస్య వీరభవతా సంయోగ మిచ్చోర్నయః" అను నదియు చాణక్యుని సభావినయమును ద్యోతక పఱుచున్నవి. ఇట్టి స్వస్తుతియందు లజ్జిగలవాని నైజము ఎంతటి నీతినమ్రతయో తేటపడుచున్నది.

కౌటిల్యుఁడను పేరఁబరంగిన ఈతని కౌటిల్యము ఇతనికి మాత్రము సహజమా? అని విచారించితిమా, తన యనుజుఁడు లక్ష్మణునిచే సేవయందుచున్న శ్రీరాముఁడు సుగ్రీవ విభీషణులను అనుమోదించుచు వారి. అగ్రజులయిన వాలి రావణులపై నభియోగము గావించిన కౌటిల్యమును, వాలి సుగ్రీవులు పోరు చుండు తఱి చెట్టు చాటుననుండి వాలిని ఏసిన కౌటిల్యమును, పూతన హననము మొదలుకొని దుర్యోధన సంహారము వఱకును కృష్ణుఁడాచరించిన కౌటిల్యమును, భీష్మద్రోణ కర్ల హననమునకై యాచరింపఁ బడిన శిఖండి యుధిష్ఠి. రార్జున కౌటిల్యములును, ఒకొక్క యుద్ధమునందును అలెగ్జాండరు వినియోగించిన కౌటిల్యమును, సీజరు అగస్టసుల కౌటిల్యమును, మహమ్మదు ఘోరి అల్లాఉద్దీను బాబరు ఔరంగజేబుల కౌటిల్యమును, క్లైవు హేస్టింగ్సు కౌటిల్యమును, నెపోలియనుని