పుట:Chandragupta-Chakravarti.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

చంద్రగుప్త చక్రవర్తి


కౌటిల్యమును, బిస్మార్కు కౌటిల్యమును, ఈసమస్త కౌటిల్యుల క్రౌర్యమును జూడఁజూడ ధర్మాసక్తులకుఁ బూర్ణముగ గర్హణీయంబయిన కౌటిల్యము రాజనీతియందు తఱుచుగఁ గన్పట్టు చున్నదని చెప్పవలసి యున్నది. ఇదియెంతయు విచారకరము.

"చాణక్యుని ఆంతరంగ జీవితము అతిశ్లాఘనీయము. తీవ్ర నిత్యాచారానుష్ఠానములను యావజ్జీవ బ్రహ్మచర్యావ లంబనమును వినాయించి తక్కిన యంశములయందెల్ల తాత్కాలికుఁడగు అరిస్టాటులు పేరుగల అలెగ్జాండరుని గురువువంటి ఉగ్ర శిక్షకుఁడు. అతనియింట సమస్త అలంకారాడంబరములును వర్జితములు. అతఁడు జితేంద్రియుఁడును సుఖదుఃఖ ఉదాసీనుండును, చిరంజీవియై మనియుండి వార్ధక్యమున ప్రాచీనాచారానుసారముగ అరణ్యనివాసియాయె. ఈ ప్రసిద్ధ మహాత్ముని చరిత్రము చూడ నతి మహోన్నత దశ యందును సర్వసంగ పరిత్యాగమునకు ప్రమాణమైయుంచె. గావుననే బ్రాహ్మణభావ మట్టిదై యుండవలెనని శాసించినవాఁడు. సార్వభౌమాధి కారైశ్వర్యములు అతని యాజ్ఞయం దిమిడి యున్నను వానినన్నిటిని తాత్త్వికౌదాసీన్యముతో చూచువాఁడు. అతని సమస్త కృత్యములును పరిశీలింప సమస్త కలా శాస్త్రాధికారియు, కల్పనాకౌశల సంపన్నుఁడును అరిస్టాటులు వలెనే సర్వశిష్యులను తన ఫక్కీ ననుసరించు నట్లు వాంఛితముల నియమింప యత్నించినవాఁడునునై కనుపట్టుచున్నాఁడు." |[1]

  1. 1 భువనచందదత్తు.