పుట:Chandragupta-Chakravarti.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

చంద్రగుప్త చక్రవర్తి


"పూర్వ ప్రతిజ్ఞయగు నందరాజ్య సర్వస్వమునకును చంద్రగుప్తాభిషేకమునకు భంగము గల్గెడిని. మఱియు నా పార్వతుఁడు అర్ధరాజ్యాలాభముతో దృప్తిఁబొందక అడియాసపడి స్వరాజ్యబలమును గూర్చికొని చంద్రగుప్తార్ధ రాజ్యమును కబళించు నట్టియని యతధర్ముండు. కావున అతని సామీప్యమున ప్రతిజ్ఞా సర్వస్వ భంగమునగు" నని యూహించి ఇట్టి సందిగ్ధమున, పర్వతకుని తొలఁగించుట సునీతియే అనియు అందున కుపాయము, రాక్షసుఁడె చూపఁగా దాని నంగీకరించుటయే భగవదాజ్ఞ యనియు నూహించెఁబోలు. వైరోచకుని యభిషేకమునకును అదేన్యాయ మనుటతోఁగూడ కూటతోరణమునుండి చంద్రగుప్తుని తప్పించుటయు నధికముఖాంతరమాయే. రాక్షస గ్రహణమునకై చేసిన యుపాయము పంచరాజ నిగ్రహమునకును మలయ కేతు సంయమనమునకును సాహాయ్యమగునట్టులు గావించిన బహుఫదాయక నీతిబీజము, ద్విపక్ష సేసలకును అనగత్య జీవనష్టము లేక యుండునట్లును భూలుబ్ధులైన మూలకంటకులు మాత్రము నివారింపఁ బడునట్లును, వేయఁబడుట మహామేథావియు, మహాజనోపకారియు నగువాని కర్మగా శ్లాఘింపఁదగినది. ♦[1]

  1. ♦కర్లయిలమ గొప్పచరిత్ర తత్త్వజ్ఞుఁడు ఫ్రాన్సుదేశపు నెపోలియన్ జర్మనుదేశపు ఫ్రెడరిక్కు చక్రవర్తుల తారతమ్యములఁ బరిశీలించుచు, ఇరుతెగలకును ప్రాణనష్టము ఆనావశ్యకముగ హెచ్చక కార్యసాధకమైన పరాజయమె జయతుల్య మని భావించిన ఫెడరిక్కుని కోమలతయే. అత్యంత ప్రాణనష్టముతో జయ సంపాదనము చేసిన నెపోలియనుని క్రౌర్యముకంటె మిక్కిలి శ్లాఘనీయంబని అభిప్రాయ పడుచున్నాఁడు.