పుట:Chandragupta-Chakravarti.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

131


త్సరము వేచియుండవలయును. సంతానము గలవారయిన పక్షమున సంవత్సరమునకంటె నెక్కుడు వేచియుండవలెను. “భోజనాదులకు వసతులున్న యెడల రెండింతల కాలము వియోగము భరింపవలెను. భుక్తికి జరుగని స్త్రీలను జ్ఞాతులు నాలుగు లేక ఎనిమిది సంవత్సరములు సంరక్షింపవలెను. పిదప వివాహకాలమున వారికి దత్తము చేయఁబడిన ఆస్తినిచ్చి పునర్వివాహము చేసికొన నియ్యవలెను.

"భర్త బ్రాహ్మణుఁడయి అధ్యయనార్థము దేశాంతరస్థుఁడయియున్న సంతానరహితయగు స్త్రీ, పదిసంవత్సరము లతనికయి వేచియుండవలయును. సంతానవతి యయిన యువతి పండ్రెండు సంవత్సరములు గడుపవలయును.

"భర్త క్షత్రియుఁ డయినచో భార్య ప్రాణమున్నంత కాలము వేచి యుండవలయును. కాని వంశ విచ్చిన్నమును దొలఁగించుట కొఱకు సవర్ణుఁడగు ద్వితీయభర్తను స్వీకరించినను నపవాదము నందదు”

"భర్త దీర్ఘప్రవాసమునకు వెడలినను, సన్యాసియయినను, మృత్యువునందినను సంతానవిరహితయగు భార్య ఏడు మాసములు వేచియుండవలెను. సంతానసమేతమైన పక్షమున నొక్క సంవత్సరము వేచి యుండవలెను. ఈ కాలపరిమితి దాఁటిన పిదప స్త్రీ తనభర్త కనిష్ఠసోదరుని లేకున్న తనభర్త గోత్రములోని వానిని పునరుద్వాహమున స్వీకరింపవచ్చును. "