పుట:Chandragupta-Chakravarti.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

చంద్రగుప్త చక్రవర్తి

అని అర్థశాస్త్రము వక్కాణించుటం బట్టి పురుషులకుం బలె స్త్రీలకును చంద్రగుప్తుని కాలమున పునర్వివాహ విషయమున స్వాతంత్ర్య ముండెనని తెల్లమగుచున్నది,

దాంపత్యవిమోచనము.

చంద్రగుప్తుని కాలమున మనమిప్పుడు మనదేశమున విననైన వినని యొక యాచార ముండెడిది. ఆ యాచారము దాంపత్య విమోచనము. భార్యాభర్తలు పరస్పరము స్నేహభావము కుదుర్చుకొనలేనిచో విధ్యుక్తముగ జరిగిన వివాహం బైనను నిర్బంధము గాదనుట యీ యాచారముయొక్క ముఖ్య ప్రయోజనము. ఇట్టి యచార మిప్పుడు విశేషముగఁ బాశ్చాత్య దేశములయందు ప్రబలియున్నది. అమెరికారాష్ట్రమునందు మితిమీరిపోయి యున్నది. చీటికి మాటికి భార్యాభర్తలు న్యాయస్థానముల కెక్కి యొకరిపై నొకరు అభియోగములనుదెచ్చి వివాహ బంధమును ద్రెంచుచున్నారు. ఇట్టి యనర్థముల కాకరమగు నీ యాచారము పలువురిచే ఖండింపఁబడు చున్నది. అయిన నిది చంద్రగుప్తుని కాలమున నేపగిది వ్యవహారము నందుండెనో కనుంగొనిన యెడల విభేదము తేట పడఁ గలదు.

భర్తపై విద్వేషముగలిగిన స్త్రీ, ఏడుమాసముల కాలము అలంకారాదుల పొంతఁబోక కాలము గడుపవలెను. తరువాతఁ దనకు భర్తయిచ్చిన నగలను శుల్కమును సంపూర్ణముగ నాతని స్వాధీనముచేసి ఆతనికి మరియొక భార్యను స్వీకరింప