పుట:Chandragupta-Chakravarti.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

చంద్రగుప్త చక్రవర్తి


వాంఛపొడమినచో నతఁడు మఱియొక స్త్రీని వివాహ మాడవచ్చును. ఈ నియమములను దిరస్కరించువాఁడు భార్యకు స్త్రీధనమును శుల్కమును ఇచ్చివేసి ఇంకను నధికముగ ధనమునిచ్చి ప్రభుత్వమువారికిఁ గొంత జరిమానా ఇచ్చుకొనవలెను. వివాహకాలమున శుల్కాదుల స్వీకరింపనివారికిఁ గూడ నీ విధముగా శుల్కా.దుల నిచ్చి తగురీతిని వృత్తిని కలిగించి పురుషుడు పుత్రకాముడై ఎందఱ స్త్రీలనైనను వివాహము చేసికొనవచ్చును. " స్త్రీలు పుత్రులఁ బడయుటకు సృష్టితులు" అను వాక్యము లర్ధశాస్త్రమునఁ గానవచ్చుటవలనఁ జంద్రగుప్త చక్రవర్తి కాలమున బురుషుఁడెందఱ భార్యలనైనను పెండ్లాడుటకు స్వాతంత్రము గలవాఁడై యుండెనని విశదమగు చున్నది.

ఇఁక స్త్రీ పునర్వివాహములను యోజంచిన

"భర్తగతించిన వెనుక భార్య ధర్మకామయయి జీవింప నెంచుకొనిసచో యామె స్త్రీధనమును శుల్కమును ఆమెకిచ్చి వేయ వలసినది. పేరునకుమాత్ర మాయమకిచ్చియుండి నిశ్చయమున కయ్యవి యామె స్వాధీనమున నుండనియెడల నవ్వానికగు వడ్డీతోడంగూడ నవి చెల్లింపఁబడవలెను.

"ఆమె కుటుంబకామయయి పునర్వివాహము ఆశించెనేని ఆయమకు భర్తగాని మామగాని ఇచ్చియుండిన సొమ్ము ఈయఁబడవలయును.” అనియు

"భర్త హ్రస్వప్రవాసమునకుఁ బోయియుండిన యెడల బహ్మక్షత్రియవైశ్యశూద్ర స్త్రీలు అతనికయి యొక్క సంవ