పుట:Chandragupta-Chakravarti.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

చంద్రగుప్తుని జననము

క్రీ. పూ. 528 లో బింబిసారుని ప్రతాపము వలన నంగదేశాక్రమణముతోఁ బ్రారంభమయి క్రీ. పూ. 371 లో మహాపద్ముని దిగ్విజయము వలన దన ఛత్రముక్రిందికి దేశమంతయు రాఁగనిన మగధసామ్రాజ్యము క్రీ.పూ 321 లో జంద్రగుప్తుని భుజాదండము నాశ్రయించెను.

ఈ చంద్రగుప్తుని యుత్పత్తియు వృద్ధియు మిగుల నాశ్చర్య కరములు. కాని వానిని గుఱించి ఇదమిత్థమ్మని సంశయ రహితంబుగ జెప్పుట కఠినకార్యము. పురాణములలో నొక రీతిగను, నాటక కధలలో వేఱొక రీతిగను, జైనబౌద్ద చరిత్రములలోను గ్రీకుల చరిత్రములలోను మఱొక రీతిగ నుండుటం బట్టి చరిత్ర కర్తలు దమ తమ చిత్తములకు సరి పోయిన ట్లూహ పోహలను విస్తరించి యున్నారు. కావున మన దేశమునందు సాధారణముగ నంగీకరింపఁబడి యుండు పద్ధతిని మొదట వ్రాసెదము. తరువాత నితరుల వ్రాతల ననువాదించెదము.