పుట:Chandragupta-Chakravarti.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

13

'నందాంతం క్షత్రియకులమ్' అని పౌరాణిక శాసనమును లోకోక్తియు గలదు. ఇందునకు దృష్టాంతము, కల్యాదిని నందమాంకితులు కొందఱు రాజులుండిరి. అందు మిక్కిలి ఖ్యాతిగాంచిన వాడు సర్వార్థసిద్ధి. ఇతనికి మహాపద్మనందుడు, ధననందుడు, మహాబలి యని నామాంతరములు. ఈతడు నవకోటిశతేశ్వరుండు. చిరకాలము భూమినేలెను. వక్రనాసికుఁడు మున్నగు బ్రాహ్మణు లతనికి కులమంత్రులు. వీరిలో రాక్షసుఁడనువాడు పరమవిఖ్యాతుడు. దండనీతి ప్రవీణుడు. నంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధ, ఆశ్రయములు, అనియెడు షాడ్గుణ్య ప్రవిభాగముల నెఱింగినవాడు; శుచి, శూరుడు. ఇతడు నందమాన్యుడై రాజ్యభారమును ధరించెను.

మహాపద్మనందుడు పెక్కు దేశముల రాజులను గెలిచి మిక్కిలి శూరుడని పేరొందెను. ఇరువది నలుగురు ఐక్ష్వాకులను, ఇరువది యయిదుగురు పాంచాలురను, ఇరువదినలుగురు హైహయులను, ముప్పది యిద్దఱు కాళింగులను, ఇరువది. యయిదుగురు శకులను, ఇరువది యాఱుగురు కురువులను, ఇరువది యెనమండ్రు మైథిలులను, ముప్పది యిద్దఱు శూరసేనులను, ఇతఁడోడించెనని వ్రాయబడి యున్నది.

మహాపద్ముడు మిక్కిలి ధనవంతుడు. ఇతనియొద్ద మహాపద్మ ధనమున్నందుననే యితని కీ పేరువచ్చెనట. నూఱుకోట్లయిన నొకపద్మమగును. అట్టి పద్మములు వేయియయిన నొక మహాపద్మమగును. ఈతడు తన ప్రతాపముచే వృద్ధిపొందించిన