పుట:Chandragupta-Chakravarti.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

11


మగధ సామ్రాజ్యముయొక్క వైభవమును హెచ్చించెను. అజాతశత్రువు క్రీ. పూ. 475 సంవత్సర ప్రాంతమున గాల ధర్మము నొందియుండవచ్చును. ఆతని మనుమడు ఉదయుడు. ఉదయుని కాలము క్రీ.పూ 450 ఇతడే పాటలీపుత్రపట్టణమును గట్టించెనని చెప్పెదరు. అతని తరువాత నందివర్ధనుడు, మహానంది అనురాజులు రాజ్యము చేసిరి.

మహానందితో క్షత్రియకులము నశించినదనియుఁ దరువాత రాజ్యముచేసిన వారందఱును శూద్రులనియు మన పురాణకారుల యభిప్రాయము. మహానందికి ఔరస సంతానము లేదు. మహా పద్ముడను దాసీపుత్తుఁ డొకడు మాత్రముండెను. మహానందికి తరువాత మహాపద్ముడే మగధరాజ్యమునకు జక్రవర్తి యయ్యెను.