పుట:Chandragupta-Chakravarti.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

చంద్రగుప్త చక్రవర్తి


గ్రామికజనంబులు అగ్నినార్పు పది యుపకరణంబుల (5. ఘటములు; 1. కుంభము; 1, ద్రోణము అనగా తొట్టి; 1. నిచ్చెన; 1, గండ్రగొడ్డలి - ఇది దంతెలు దూలములు పడఁగొట్టుటకు; 1. తూరుపుబుట్ట-పొగను బారదోలుట కిది; 1. అంకుశము; 1. పటకారలజత; 1. తోలుసంచి) జూఫుటొండె పచనాదికార్యముల నింటివెలుపలఁ జేసికొనుటొండె చేయవలసియుండెను,

ఎచ్చటనైన నగ్నిబాధ గలిగినయెడల నా ప్రాంతము నందలి గృహస్థు లెల్లరును దమతమ యుపకరణములతో వెలువడి యా యగ్నిని చల్లారుపవలసి యుండెను. అట్లు చేయని వారికి శిక్షలు విధింపఁబడుచుండె.

పంచాయతులు

పురపరిపాలనాక్రమము లెటువంటివో పాటలిపుత్ర వర్ణనాధ్యాయమునందు విస్తరింపఁబడి యున్నవి. సైన్యవ్యవస్థ ప్రకరణమునఁ దత్పరిపాలనాక్రమము వివరింపఁబడి యున్నది. మొత్తముమీద తేటపడునంశ మెద్దియన్న సమస్తాంశములకును పంచాయతి పరామర్శయను పద్ధతి ముఖ్యాధారముగ గ్రహింపబడి యుండుటే. పుర పరిపాలనమునకు ఆఱు పంచాయతులు, సైన్యనిర్వహణమునకు ఆఱు పంచాయతులు, శిల్పులు, వర్తకులు, కర్మకరులు మొదలుగాఁగల వృత్తి కులముల విమర్శనమునకు ఆయా కులమున కాయాకులస్థుల పంచాయతులు, గ్రామ పాలనమునకు గ్రామ పంచాయతి యనుచు నిట్లు పంచాయతి పుంజముగా నున్నట్లు తేటపడును. కొన్ని పంచాయతులు రాజ నిర్ణితములును రాజ పురుష