పుట:Chandragupta-Chakravarti.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

125


నిర్ణితములును, తదితరములెల్ల జనసముదాయ నిర్మితములు. అత్యంత బలిష్ఠ రాజకార్యముల వినా తక్కిన వన్నియు జననియుక్త పంచాయతులు. వీనియందును రాజపురుషులై న గ్రామప్రముఖులైన నధ్యక్షులుగ నుండిరి. కాఁబట్టి రాజభక్తికి విరోధము లేకుండను జనస్వతంత్రముకు లోపము లేకుండను కార్యములన్నియు నిర్వహింపంబడె. మఱియు పంచాయతివారు తమ తీర్మానించు విషయములందు ప్రత్యక్ష జ్ఞానానుభవములుగల వారుగాను, వాదిప్రతివాది సాక్షుల పూర్వోత్తరముల తెలిసినవారుగాను, ఆయాజన సముదాయమునకు సత్యసాత్త్వికాదులయందు యశోమాన గణ్యతాబద్ధులుగాను ఉండుటంబట్టి వారి నిర్ణయములు న్యాయ్యములు గాను అంగీ కార్యములుగాను నుండె. వారు జనసముదాయ క్షేమాభివృద్ధుల సహజ ప్రీతియుతులగుటం బట్టియు, తత్సముదాయ అవయవీభూతులు కావునను వివాద నిర్ణయంబులకు అనగత్య వ్యయంబుల కాస్పద ముండలేదు. కావున న్యాయనిర్ణయములు సులభసాధ్యములై యుండుచు జనులకు సుఖకరములై యుండె. ఇక్కాలమునందు బలెవ్యాజ్యములకుఁ గల కాలవిలంబములు కాని, పలు తెఱంగుల ద్రవ్యనష్టములుకాని, న్యాయవాదుల తెలక్రిందుల పొరలింపులు కాని, న్యాయనిర్ణయ విపరీతములు కాని, వివాదుల యితర కార్యభంగములు కాని ఎంతమాత్ర ముండలేదని నమ్మవచ్చును. జనస్వతంత్రతా బుద్ధియు పదే పదే వర్ధిల్లుచు ప్రజాగౌరవమును భద్రముగ సంరక్షింపబడె. రాజక్షేమమును అభివృద్ధిఁ బొందె.