పుట:Chandragupta-Chakravarti.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

123

భిషజులు సర్వవైద్యవిశారదులు. చికిత్సకులు సాధారణ వైద్వులు. జాంగలీవిదులు విషవైద్యులు. సూతికాచికిత్సకు లనువారు మంత్రసానులు. దాత్రికలును సైన్యమువెంట నడచు రణవైద్యులును ఈ తరగతిలోఁ జేరినవారె.

మూఁడు మూలికల పేరునెఱింగిన వారెల్లరును వైద్యులుగ నుండుటకు వీలుండినదిగాదు. ప్రభుత్వమువారి యనుమతిలేని దెవ్వరును వైద్యవృత్తి నవలంబింపరాదు.![1] ఆ వృత్తియందుండి అజాగరూకులయి మెలంగనురాదు. వైద్యునిలోపంబున రోగికి నపాయము గలిగినచో వైద్యుఁడు దండార్హుండయి యుండెను. అనుమానాస్పదంబగు మరణము తటస్థించినచో నీ యిరువదవ శతాబ్దంబునంబలె నప్పుడును శవమును పగులదీసి ఆశుమృతపరీక్ష, (Post Mortem Examination) చేయు చుండెడివారు.

ఇట్టినియమములతో వైద్యులసిబ్బంది యుండినపు డెట్టి విశేషరుగ్మత వాటిల్లినను దగుసాయము గలుగుచుండెనని ప్రత్యేకించి వ్రాయుటయే పని లేదు. క్షామాదుల ఫలంబుగ జనించిన 'మారక' వ్యాధులను రూపుమాప నెల్లవైద్యులును దమ తమ మందు తిత్తులతో సిద్దముగ నుండువారు వారి తోడంగూడ దైవప్రార్థనాదికములు సల్పి యాపదం బాపఁగల సాధుజనంబులును బరిశ్రమ చేయుచుందురు.

అగ్ని బాధలేకుండఁ జేయుటకుఁ దగిన నిర్బంధములును బరికరములును నేర్పఱుపఁబడియుండెను. వేసవి కాలమున

  1. 1 ఈ విషయమున శాసనము చేయుటకు మన ప్రభుత్వమువా రిప్పుడిప్పుడు ప్రయత్నము సేయుచున్నారు.