పుట:Chandragupta-Chakravarti.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

117


కంటకశోధన న్యాయసంఘముల మువ్వురు అమాత్యులు మువ్వురు ప్రదేష్టారులును అధికారులు. అమాత్యులు లోకానుభవాదులు గల మంత్రి వర్గంలోని వారని యిదివఱకే వ్రాయఁ బడియె. స్థానికులయి విషయములను జక్కఁగ విమర్శించి కనుగొనుటకు యోగ్యత గల యధికారులు మువ్వురకును ప్రదేష్టారులని పేరు. వీరు ఏయభియోగము వచ్చినను దానికి వలయు నుపక్రమ ప్రయత్నములను బరీక్షలను జేసి అమాత్యులకు సాయపడుచుండేవారు. రాజునకును రాజ్యమునకును సంబంధించిన నేరములును ప్రజోపద్రవ కరములగు నేరములును హత్యేత్యాది ఘన దోషములును బహుజన సంబంధకములును నీకంటక శోధనములకు విషయములు.[1] ఉరిశిక్ష నిచ్చుటకుఁ గూడ వీని కధికారము గలదు.

పై రెండు తెఱంగుల న్యాయసంఘములును సంగ్రహణములందును అనఁగా మన తాలూకా పట్టణమువంటి పట్టణములందును నాలుగువందల గ్రామములకు ముఖ్యపట్టణములగు ద్రోణముఖములందును 800 కు ముఖ్యములగు స్థానీయము లందును ప్రతి జనపథసంధి యందును అనఁగా రెండుమూఁడు మండలముల పొలిమేరలు కలియు పట్టులందును నిర్ణీతకాలమున చేరి న్యాయము తీర్చుచుండెను.


  1. కారకరక్షణము, వైదేహరక్షణము, ఉపనిపాతప్రతీకారము, గూఢా జీవులనుండిరక్ష, ఉపకాత్మాభిగ్రహము, ఆశు మృతక పరీక్ష, వాధ్యధర్మానుయోగము, సర్వాధికరణ రక్షణము, కన్యాప్రకర్మము మున్నగునవి కంటక శోధనములకు విషయంబులని అర్థశాస్త్రము తెలుపుచున్నది.