పుట:Chandragupta-Chakravarti.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

చంద్రగుప్త చక్రవర్తి


వెడలఁగొట్టుటకును స్వతంత్రుఁడయి యుండెను. ఇతనిది మొదటి న్యాయస్థానము. రాజుగారిది ఉత్తమన్యాయస్థానము. ఈ రెంటికిని మధ్య స్థానము వహించి దేశమునందలి న్యాయ విచారణమంతయు నడుపు న్యాయస్థానములు పెక్కులుండెడివి. ధర్మస్థీయములనియు కంటకశోధసములనియు నవి రెండు తెజంగులుగా విభజింపఁబడియుండె. ఈవిభాగమునకుఁ గారణము వ్యాయోగ విశేషంబె.

ధర్మస్థీయములు ఆఱుగురు న్యాయాధిపతుల సంఘములు. అందుమువ్వురు శాస్త్రాధ్యయన పారీణులై ధర్మస్థులు నాఁబరగుచుంద్రు. తక్కుంగల మువ్వురును రాజుగారి యమాత్యులలోనివారు. వీరు లోకానుభవము గలవారగుటం జేసి శాస్త్రవేత్తలకు సహకారులయి న్యాయము దీర్చుచుందురు. ధర్మస్థీన్యాయ సంఘముల మ్రోల విచారింపఁబడు చుండిన విషయములు సర్వసాధారణములు. ప్రజలలో నొండొరులకుఁ గల సామాన్య సంబంధ విషయక వివాదములను స్వల్ప ప్రజా సంఘంబు లొండొంటికింగల సామాన్య సంబంధ విషయక వివాదములను ఈ ధర్మస్థీయములు దీర్చుచుండెడివి 1[1] వీనికి కొద్దిపాటి జరిమానాలు విధించుటకంటే నెక్కుడధికారము లేదు.

  1. 1. వ్యవహారస్థావనlu, సమయవిచ్చేదాదులు, స్వామ్యాదికారభృత్యాది కారములు, దానకల్పనలు, ఋణములు, ఔపనిధికములు, విక్రిత క్రీతాసుశయములు, దానములు, సాహసములు, దండపారుష్య వాక్పారుష్యములు, ఆస్వామి విక్రయములు, స్వస్వామినంబంధములు, సీమావివాదములు, మర్యాదాస్థాపనములు, వాస్తుశయులు, వాస్తవిక్రయములు, వివీతక్షేత్ర పథ హింసాదికములు, బాధా బాధికములు. వివాహధర్మములు, వివాహసంయుక్తములు. శ్రీధనకల్పనలు, సంభూయసముద్దానములు, దాయవిభాగదాయక్రమములు మున్నగునవి ధర్మస్థీయములకు విషయములని ఆర్థశాస్త్రమున వర్ణించఁబడినవి.