పుట:Chandragupta-Chakravarti.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

115


న్యాయవిచారణ

"హిందువులు సొమ్మును, వడ్డీకిచ్చుట లేదు. అప్పు పుచ్చుకొనుటయు నెఱుంగరు. ఒరులకు గ్రీడొనరించుటకాని, ఒరులవలన గీడొందుటకాని ప్రాచీనాచారమునకు విరుద్దము. కావున సమ్మతి పత్రములుగాని తాకట్టులుగాని దొరకవు. ఒక వేళ ఋణమిచ్చియున్నను ధనము నిక్షేపించియున్నను, దానిని ఋణగ్రస్తుని వలనగాని, ధనగోప్తవలనగాని తిరిగి రాఁబట్టుటకు శాసన సాహాయ్యము లేదు. కావున ఋణదాతగాని, ధననిక్షేపిగాని విశ్వసించినవాఁడు మోసకాఁడయినయెడ, నందునకు దన్నుదా దూఱులాడుకొనుటకంటె నితరోపాయముగానఁడు” అని మెగాస్తనీసు వాసియున్నాఁడు. ఈ వాక్యములు స్థూల దృష్టితో వాయఁబడిన వనియు వానివలన నప్పటి యమాయకస్థితి నిరూపింపఁబడు చున్నదనియు మాత్రము చెప్పవలసి యున్నది. పైనివర్ణితమయిన వ్యాపారాదుల పరిమాణమునుబట్టి చూచినను చాణక్యున్ని అర్థశాస్త్రమునుబట్టి చూచినను అక్కాలమున న్యాయస్థాన పరంపరయుఁ దదుచితచట్ట సముదాయంబును నుండెనని వ్య క్తమగుచున్నది.

ప్రతి గ్రామికుఁడును, అనఁగా గ్రామాధికారియు, గ్రామ వృద్దులతోడంగూడ ననఁగా గ్రామ పంచాయతితోడం గూడ పథమన్యాయస్థానంబై యలరారుచుండు. కొన్ని వ్యాయోగముల నీ న్యాయస్థానము వారికి సంపూర్ణాధికార ముండెడిది. దొంగలను దుర్మార్గులను గ్రామికుఁడు దన గ్రామమునుండి