పుట:Chandragupta-Chakravarti.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

చంద్రగుప్త చక్రవర్తి


కామరూపము1[1] నుండియు, సింహళము నుండియు; తోళ్లు హిమాలయ పర్వతములమీఁది మ్లేచ్ఛ గ్రామముల నుండియు; ‘కాలేయక' మను గంధపుచెక్క స్వర్ణభూమి యనఁబడు బర్మా నుండియు; పట్టుగుడ్డలు చీనా నుండియు; అగరు సముద్రమున కావలినుండియు వచ్చుచుండెను. క్రీ. పూ. ఆరవ శతాబ్దమున భరతవర్షపుఁ బశ్చిమతీరమందలి వణిక్కులు బాబిలోను రాజ్యముతో వ్యాపారాదులు సలుపుచుండి రనుటకు నిదర్శనములు గలవని బ్యూలరు పండితుఁడు వ్రాయుచున్నాఁడు. ఇదియును చంద్రగుప్త చక్రవర్తి కాలమునకు సంబంధించిన దగుటవలన పై జాబితాలతోడం జేర్చిన సప్పటి వ్యాపారపరిమితి యపారమని వెల్లడి సేయుచున్నది.

సర్వసాధారణముగ వ్యాపారము వెంటన చేతిపను లభివృద్ధి యందు చుండును. అవ్వానియవస్థను గుఱించి విశేషము

వ్రాయుటకు విపులాధారములు లేవు. సూత్రాధ్యక్షుఁడను అధికారి పొడగట్టుట వలనను అతఁడు నేత పనిని చూచుకొనుటకు మాత్రమే నియోగింపఁబడి యుండుటవలనను అప్పని అక్కాలమున విస్తారము జరుగుచుండెనని చెప్పవచ్చును. కుమ్మరము వడ్రంగము మున్నగు సాధారణపుఁ బనులనిట వక్కాణించుటే యనవసరము. అర్థశాస్త్రమునందలి యొకానొక ఘట్టములోని వ్రాతనుబట్టిచూడ నాకాలమున గాజుపని జరుగుచుండినట్లును అది నాణ్యపు బనులలో నొక్కటిగ నెన్నఁబడుచుండి నట్లును గానవచ్చుచున్నది.2[2]

  1. 1. అసాము.
  2. 2. ఇండియన్ ఆంటిక్వేరీ సం 34 పే 116.