పుట:Chandragupta-Chakravarti.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

107


మెగాస్తనీసు భరతవర్షమున సువర్ణమును త్రవ్వుటను గుఱించి చిత్రమయిన ఈ క్రింది కథను వ్రాసియున్నాఁడు.

తూర్పు సరిహద్దునందలి 70-80 మైళ్ల చుట్టుకొలతగల ఉచ్చ భూప్రదేశమున భారతేయులలో నొక తెగ యగు 'దరదులు' అనువారు వసించుచున్నారు. అచ్చట భూగర్భమున బంగారు గనులు గలవు. అందువలననే సువర్ణమును త్రవ్వు చీమలును నచ్చటగలవు. అవి యడివినక్కలకు పరిమాణమునఁ దీసిపోవు. వాని త్వరిత గమనము విభ్రమమును బుట్టించును. అవి వేఁటాడి జీవనము సలుపును. వానికి సువర్ణమును ద్రవ్వుటకు శశిర ఋతువు అనుకూలము. అవి బంగారు గనులనుండి ఆ లోహమునుద్రవ్వి దానితోడంగూడిన మట్టిని అడవి ఎలుక (Moles) వలె గనిద్వారమునఁ గుప్పలువైచును. అట్లు పడిన సువర్ణ రజమును కరగించుటయే కర్తవ్యము. చుట్టుప్రక్కలం గల జనులు మోత పశువులను గొనితెచ్చి దొంగతనముగా నా మట్టిని మోసికొని పోవుచుందురు. వారు ఎఱుకవడునట్లు వచ్చినచో నచ్చటి యచ్భుతమగుఁ జీమలు వారి నెదిర్చి పారిపోనీక వెన్నఁటి వారిని వారి పశువులను జంపివేయును. కావున వా రచ్చటచ్చట వివిధములగు మాంసఖండములనువైచి యా చీమలు వానిని భక్షించుటయం దేమఱియుండ బంగారు పొడిని యపహరింతురు. ఆరజమును గరగించు పద్ధతులు తెలియవుగాన వా రితరుల కమ్ముచుందురు. 1 [1]

  1. 1. మాక్రిండల్ మెగాస్తనీసు. పే 94 ఈ కథ మెగాస్తనీసునకు ముంధనేకులు చెప్పుకొని యున్నారు.