పుట:Chandragupta-Chakravarti.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

చంద్రగుప్త చక్రవర్తి

నాణెముల పేళ్లు. అందలి విశేష లోహములు వెల (గురిగింజలలో)
1 పణము 1/16 రాగి, 1/16 సీసము =80 గింజలు = 80/122 తులములు = ఇంచుమించుగ నిప్పటిరూపాయిలో 2/3 వంతు
2 అర్థపణము " = 40 గింజలు,
3 పాదము " = 20 గింజలు,
4 అష్టభాగము " = 10 గింజలు
1 మాషము 1/4 వంతు ఇతరలోహం = 5 గింజలు
2 అర్ధమాషము " 2 1/2 గింజలు,
కాకణి " 1 1/4 గింజలు
అర్ధకాకణి " 5/8 గింజలు

పై వివరణపట్టికయందుఁ గనినవిగాక అర్ధశాస్త్రమునందు చాణక్యుఁడు బంగారు నాణెములను బేర్కొని యున్నాఁడు. 5 గింజలయెత్తుగలది మాషమనియు, 16 మాషముల యెత్తుది సువర్ణములేక కర్షకమనియు, నాలుగు కర్షముల యెత్తుదీ యొక పలమనియు వాడియున్నాఁడు. ఈ పరిమాణ పరంపర తూనిక మాత్రమునకయి యుండనోపునా ? తూనిక మాత్రమునకు సువర్ణపు దిమ్మెలు గావలెనా? చంద్రగుప్తుని కాలమున నియ్యవి వాడుకలో నుండిన బంగారునాణెములని చెప్పుటయే యుక్తీ యుక్తముగ నున్నది. అప్పటికాలమున హిందూదేశము బంగారమునకుఁ బేరువడసి యుండెను.