పుట:Chandragupta-Chakravarti.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

చంద్రగుప్త చక్రవర్తి

పై సంగతు లత్యద్భుతముగఁ గన్పించినను నందు సత్యము లేకపోలేదు. త్రవ్వుచుండినది చీమలుగావు. కాని తిబెట్టుదేశపు ఖననక్రియాదక్షు లక్కార్యములను దీర్చుచుండిరి. వారి యుపకరణాదులనుబట్టియు వారి పద్ధతులను బట్టియు నభ్యాసములను బట్టియుఁ బై కథ పుట్టియుండునని నిర్ణయింపఁబడి యున్నది.

ఏది యెట్లయినను బూర్వము హిందూదేశమున చీమలు బంగారపు పుట్టలఁ బెట్టుచున్న వన్నను బయటి దేశముల వారలు నమ్ముచుండెడివారు. అట్టి కాలమున బంగారపు నాణెము లుండెనని చెప్పుటకు వేరు యుక్తులు గావలెనా ? ఒక వేళ బంగారపు తూనికదిమ్మెలను నుపయోగించుచుండి రేమో.1[1]

నాణెముల కథ యింతటితోఁ జాలింతము. ఇదివఱకుఁ బేర్కొనిన మార్గములేగాక రాజునకు నాదాయము నిచ్చు మార్గము లింకను ననేకములుండెడివి. వాని విస్తారవివరణమిట .యనవసరము,

సామంత ప్రభువులు గొని తెచ్చియిచ్చు కప్పములును, గ్రామరక్షక సంఘములు వసూలుచేయు నపరాధములును, ఖయిదీలను విడిపింప నియ్యంబడు చుండిన ధనమును, అభిజ్ఞాన పత్రముల విలువయు, అవసరమగు నెడల దేవాలయాదులలోని ద్రవ్యమును, ఓడలమీఁద పన్నులును, బాటతీరువలును, గనుల తీరువలును, అడవి ద్రవ్యముల మీఁద సుంకములును, జరిమానాలును, రాజుగారి బొక్కసమునకుఁ జేరుచుండెడివి.

  1. 1. ఇండియన్ ఆంటిక్వేరి. సంపుటము. 4. పే 226.