పుట:Chandragupta-Chakravarti.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

చంద్రగుప్త చక్రవర్తి

ఇప్పటివలెనే చంద్రగుప్తుని కాలమునందుఁ గూడ 'ఉప్పు' చేయుట అమ్ముట ప్రభుత్వమువారి హక్కేయయి యుండెను. వారుస్వదేశమున స్వంతముగ ఉప్పును పండించుటయుఁగలదు. ఒకొక్కతఱి నా స్వాతంత్ర్యము కౌలుదారులకు గుత్తకిచ్చుటయును గలదు. స్వదేశమునం దుత్పత్తియగు చుండిన యుప్పుగాక విదేశములనుండియు దిగుమతియగు చుండెడిది. అందలి వ్యాసారమును బ్రభుత్వము వారిదే యయి యుండెను.

సురాలోలు లిక్కాలమునందుఁబలె నక్కాలమునను ప్రభుత్వము వారికి ద్రవ్యము నీయుచుండిరి. కాని అప్పుడు త్రాగుడునకయి సర్వస్వము పోఁగొట్టుకొనుట తటస్థింపకుండుట కొక కొన్ని నిబంధన లేర్పడియుండెను. నిర్ణయింపఁబడిన పరిమితి కెక్కుడుగ నెవ్వరికిని హాలారసంబు విక్రేత లమ్ముట లేదు. వెలకును హద్దు లునుపఁబడి యుండెను. త్రాగి మైమఱచి పడిపోయిన వారి శరీరముపై నుండు సొత్తును గాపాడుటకు నుచితమగు విధులు నియమితమయి యుండెను. నీదేశవు సారాయిలపై సాధారణ సుంకములుగాక 100 కి 5 వంతున పన్నులు విధింపఁబడు చుండెను. సురామందిరములను గుఱించిన శాసనములలో, ఆ మందిరములు సౌకర్యములై న పెక్కుగదులుండు నట్లును, ఒక్కొక్కగదియందు వలసినన్ని మంచములును కుర్చీ లుండునట్లును, ఆయా ఋతువులకు ఆవశ్యకములైన యనుకూలము లన్నియు పొసఁగి యుండునట్లును, నిరంతరము పుష్ప