పుట:Chandragupta-Chakravarti.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14]

ఎనిమిదవ ప్రకరణము

105


హారములతోను అగరు చందనాది పరిమళ ద్రవ్యములతోను నిండుకొని యుండునట్లును, అలంకరించియుండ వలెనని విధింపఁబడి యున్నది. దీనినిఁబట్టి కొందఱు చరిత్రకారులు ఆ కాలమున త్రాగుబోతుతన మెక్కుడుగ నుండెనని యూహించు చున్నారు. కాని మొదట వ్రాసిస నిబంధనలను జాగరూకతతో స్మరించిన యెడల నీ యలంకారాదులు త్రాగనేగు స్వల్పసంఖ్య జనంబుల యారోగ్యముకొఱకును పరిసర ప్రదేశస్తులకు జుగుప్సాభార మాపాదింప కుండుటకును విధింపఁబడెనని తోఁచక మానదు. కొలతపాత్రలను తూనిక యంత్రములును ప్రభుత్వమువారి వలననే చేసి యమ్మఁబడు చుండెనని ఇది వఱకు వ్రాసియున్నారము. దానినిఁబట్టి 'యిండియన్ అంటి క్వేరీ' సంపాదకులు ఆకాలమున నాణెములు బహుస్వల్పముగ నుపయోగింపఁ బడుచుండెననియు వ్యాపారమంతయును వస్తుగ్రహణ ప్రతిగ్రహణము వలననే జరుగుచుండెననియు వ్రాసియున్నారు. కావున నాకాలమునందు నాణెముల వలన రాజునకు నెక్కుడుగ లాభము గలుగు చుండెనని చెప్పుటకు వీలు లేదు. అయినను నక్కాలపు నాణెములను వానియందలి లోహ విశేషంబును ప్రస్తుతపు నాణెములతోటి సామ్యమును మా చదువరులు గ్రహించుటకయి యీ క్రింది వివరణ పట్టిక నిచ్చుచున్నాము.