పుట:Chandragupta-Chakravarti.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

103


అపరాధము విధింపఁబడు చుండెను. ఈవిధముగను రాజుగారి బొక్కసమునకు విశేషద్రవ్యము చేరుచుండెను.

విదేశములనుండి దిగుమతియగు సామాగ్రిపై వ్యాపార సుంకముగాక రాజుగారికి మఱియొక విధమగు సుంకము చెల్లు చుండెడిది. మొత్తముమీఁద దిగుమతియగు వస్తువులకుఁ బ్రబలతమమగు పన్ను విధింపఁబడుచుండెను. (1) 'శుల్క' మనఁబడు వ్యాపారసుంకమును (2) 'వర్తని' యనబడు మార్గసుంకమును 1[1] (3) 'గుల్మదేయ' మనఁబడు సైనిక సుంకమును (4) 'భాగ' మనఁబడు దిగుమతి సుంకమును సర్వసాధారణముగ దిగుమతి వస్తువులకుఁ దప్పినవి కావు.

ఇప్పగిది సార్వభౌమునకు నెగుమతి దిగుమతులవలన సుంకముల రూపమున నాదాయ ముండెడిది.

ఆకాలమున కొలతపాత్రలును తులాయంత్రములును ప్రభుత్వమువారే సిద్దపఱచి యమ్ముచుందురు. వ్యాపారులు వానిని కొనుటయేగాక ప్రతిదినమును వాని పరిమాణము సరి యయినదని నిర్ణయముద్ర వైచుటకు ప్రభుత్వమువారికి కొద్ది పాటి రుసుము చెల్లించుచుందురు. వ్యాపారస్థులు ప్రజల నేమాత్రము ఏమఱుచుటకుఁ బ్రయత్నించినను నపరాధులుగ నెన్నబడి జరిమానాలతో శిక్షింపఁ బడుచుండిరి.

  1. 1. ఇది మఱియొక రాజ్యమునుండి తన రాజ్యమునకు వచ్చు వస్తువులమీఁద రాజు పదియించు సుంకము.