పుట:Chandamama 1947 07.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచి పోయింది.

మేళతాళాలతో రాజపుత్రికి ఎదురుకోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగినమోసం తెలుసుకొన్నది. ఈవార్తవిని ఫిరోజిషా దిగాలుపడ్డాడు. రాజపుత్రి లేక, తానుబ్రతకడం కల్ల అనుకొన్నాడు. ఎలాగైనా ఆమెను తీసుకురావాలని కాలినడకను బయలుదేరాడు.

శిల్పి ఎక్కినగుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానంమీద దిగింది. రాజకుమారి శిల్పిచేసిన మోసం తెలుసుకొని ఏడువ సాగింది. ఆ ఏడుపు వేటకువచ్చిన గ్రీసురాజు చెవులబడ్డది. అతడు చప్పునవచ్చి జరిగిన మోసం రాజపుత్రివల్ల విని శిల్పితల నరికివేశాడు.

గ్రీసురాజుకూడా వంగరాజు పుత్రిమీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టంలేదు. రాజు బలాత్కారంనుంచి తప్పుకోటానికి పిచ్చిఎత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్ళను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమెపిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులిప్పించాడు. లాభంలేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి?

ఇక్కడ యిలా జరుగుతూవుండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజిషా ఊళ్ళుదాటాడు. ఉకాలు దాటాడు. చీమలు దూరని చిట్టడవీ, కాకులు దూరని కారడవీ దాటాడు. ఎక్కడా తన రాజపుత్రిజాడ తెలియలేదు. ఏరులు