పుట:Chandamama 1947 07.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ శబ్దాన్నిబట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో ధగధగ మెరుస్తూ వుంది, ఒక పెద్దగది. లోపలి కెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పంమీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు. ఫిరీజిషా తనకళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో ననుకొన్నాడు. తనవొల్లు తాను గిచ్చు కొన్నాడు. బాధ తెలుస్తూ నే వుంది. అప్పు డదంతా నిజమని అనుకున్నాడు.

మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కలమధ్య చంద్రుడిలాగా వుంది. బంగారపుజుట్టు, తళతళా మెరుస్తూవుంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళువిప్పి అతన్ని చూచింది.

ఫిరోజిషా ఆమెను ప్రక్కకు తీసుకెళ్లి తన కధంతా చెప్పాడు. తనతో పర్షియాకువచ్చి తన్ను పెండ్లాడ వలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రికూడా అతన్ని ప్రేమించింది. రెండోవారికి చెప్పకుండా అతనివెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణంముందు వాలారు.

మేళతాళాలు, బాజాభజంత్రీలు లేకుండా కొత్తపెండ్లికూతురును అంత:పురానికి తీసుకొనివెళ్ళటానికి ఫిరోజిషా మనస్సు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడేవస్తాననిచెప్పి ఆమెను, గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు.

నవాబు సంతోషానికి మేరలేక పోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈసంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడుకాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి, "మిమ్ము ఈ గుర్రంమీద అంత:పురానికి తీసికొనిరమ్మాన్నారు," అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రమెక్కి అతని