పుట:Chandamama 1947 07.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాటాడు, నదులుదాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు, చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకొన్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు.

ఫిరోజిషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్లి "నాకు భూత వైద్యం తెలుసు. రాజపుత్రి పిచ్చి కుదురుస్తా" నన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంత:పురానికి తీసుకువెళ్లడు. కొత్త వైద్యుణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది.

"రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రంమూలాన ఈవ్యాధి కలిగింది ఈమెను ఆగుర్రంమీద ఎక్కించిచుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి. మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈవ్యాధి పూర్తిగ పోదు. పదియేళ్ళు గడువిస్తే కీలు గుర్రం చేస్తాను," అన్నాడు ఫిరోజిషా.