పుట:Chakkatladanda.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ చేదస్తమున నేళ్ళు చెల్లిన బాపండు| పెద్ద చెర్వున జల్లు బేడనీళ్ళు
కలవాడనని కన్ను గానని మతకరి | నెదురైన బావని జదియగొట్టు
కడుపు గట్టుక మూట గట్టు పిసినిగొట్టు | గవ్వబోయిన పూట బువ్వమాను
మరులెక్కి యొడలు తిమ్మిరిగొన్న తుంటరి| వరుసవావుల బెద్దవాక గలుపు

గీ॥ మంచి చెడ్డల నరయక మదికి దోచి |నట్టి యొకపట్టు బట్టుట చెట్ట సుమ్ము
అని పలుకు . . . . . 71

సీ॥ నారు బోసినవాడు నీరు దా జల్ల డే| బల్లె దెచ్చినవాడు పలుపు వేడె
చెలము ద్రవ్వినవాడు చేము ద్రాడుంచడే | యెడ్లను గొన్నవాడేరు కొనడె
గుడిసె గట్టినవాడు తడక దాగట్టడే | పిల్ల బెంచినవాడు పెట్టెగొనడె
ఊరు గాయిడెడివాడుప్పు దాబడయడె | జిగిజక్కి కొనువాడు జీనుగొనడె

గీ॥ గొప్పంగు నట్టివాని గై కోలు సేసి కొదువ సేయునె వలసిన కొంచెములను
అని పలుకు . . . . . 72

సీ॥ గచ్చాకు పుచ్చాకు కలిపి నూరినయుండ | మంచి మందై తెగుల్మాన్ప జాలు
చెడు చెట్టు వడు చెట్టుచేరి క్రమ్మిన పట్టు | అడవి మైకలప లేవడుల దీర్చు
చిరుగవ్వ మరుగవ్వ చేర్చి పెట్టిన | ప్రోగు కూరాకు లేనట్టి కొఱత దీర్చు
తడచువ్వ మడచువ్వ తడకగా గట్టిన | గుక్క గుడిసే దూరు కొదువ దీర్చు

గీ॥ పలు దినుసులందు నది కొంచెపాటిదైన| నక్కఱకురాని దొక్కటియైనలేదు
అని పలుకు . . . . . 73

సీ॥ నెఱసిన ముసలమ్మ నెఱులు జవ్వనమున | దుమ్మెద టెక్కల తోటిసాటి
ఉడికి ముద్దైన గుమ్మడిపండు మున్నుపా | దుననున్నపుడు కుండతోటి సాటి
చిలికి గుల్లై వంటచెఱకు జేసిన చేవ | తొలుత మాకుననుక్కు తోటిసాటి
పగిలి పెంకై నేలబడిన చిళ్ళప నంటి పాటున జట్రాతి తోటి సాటి

గీ॥ కలిమి బలుములు సతములు కావుసుమ్ము | కాఱుమారిన కొలదిని మాఱుచుండు
అని పలుకు . . . . . 74

సీ॥ పెద్దకెంపొక్కటి పెంటలో దొరికిన | విలువ తగ్గదు దానివెలుగు పోదు
కమ్మ గుమ్మడిపండు కంచెలో కాసిన | చక్కదనముబోదు చవియుబోదు
మల్లె పూవులు మాలపల్లె లో పూసిన | ఠీవితగ్గదు కమ్మతావిబోదు
గొప్ప నెమలి గుడ్డు కోడి దా పొదిగిన | చిన్నె మాఱదు కుంచె వన్నె పోదు

గీ॥ వాసిగల వంగసము గలవాని కెపుడు | చోటు మాఱిన మాఱునే సొంపు బెంపు
అని పలుకు . . . . . 75