పుట:Chakkatladanda.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ మొలక పాటున నడ్డిమలచి కట్టినగాని | తడబొంగు పల్లకి దండె గాదు
లేత పాటున జివ్వి పాత్ర గట్టినగాని | మండ చక్కని యంటు మావి కాదు
దూడ పాటున ద్రిప్పియాడ నేర్పినగాని | ఎద్దు పన్నిన గంగిరెద్దు కాదు
నారు పాటున దీసి నాటి పెంచిన గాని | దుక్కి మూసిన వరి దుబ్బుగాదు

గీ॥ పాటుపడి నేర్వవలె జిన్ననాటనుండి | కాని యెడ నెందునను జాణగాడు సుమ్మి
అని పలుకు . . . . . 66

సీ॥ కాళ్ళు బోయినవాడు కాళ్ళకై తిరుపతి |గట్టెక్కబోయిన గదలుటెట్లు
కనులు బోయిన వాడు కనులకై తాగండ | జోతి జూడగ బోవ జూచుటెటు
చెవులు బోయినవాడు చెవులకై సుద్దులు | వినగబోయిన జేరి వినుట యెట్లు
మాట బోయినవాడు మాటకై మంతరాల్ | చదువబోయిన బట్టి చదువటెట్లు

గీ॥ కానరానట్టి మేలొండు కలదటంచు | కాని పనిసేయగా సమకట్టదగదు
అని పలుకు . . . . . 67

సీ॥ పట్టజాలము నీళ్ళుపాలలో గలసిన | తెలియమే పెరుగులో గలసినపుడు
ఈనెలేము కపురంబు గాలితో గలసిన | నెరుగమే దివ్వెతో బెరసినపుడు
పొడ కట్టలేము పుప్పొడి నేల గలసిన | కానమే పూవుతో గలసినపుడు
ఎరుగలేము కనాడు దరబారు గలసిన | చీలదే పూరితో జేరినపుడు

గీ॥ ఒక్కడొక్కని గలసిన జక్కసదుకు | నతడె వేరొండు గెలసిన నదుకడేపుడు
అని పలుకు . . . . . 68

సీ॥ పొట్ల కాయకు రాయి గట్టుట తిన్నగా | బెరుగుటకే కాని విరుగ గాదు
పసిడి రేకులకుప్పుము సరి కాల్చుటవన్నె | పెరుగుటకే కాని తరుగ గాదు
చదివెడి వానికి జబుకు దెబ్బలు బుద్ధి| వచ్చుటకేకాని నొచ్చగాదు
జక్క పిల్లకు గాళ్ళు నొక్కుట జక్కగా| జరుగుటకే కాని విరుగ గాదు

గీ॥ తొలుత నొక్కింత బాదగా దోచియున్న | మంచి కై చేయు పనిని మన్నించ వలయు
అని పలుకు . . . . . 69

సీ॥ జొన్నకూటిని దిన్నయన్న కంటెను లావె |సన్న బియ్యము దిన్నయన్న బలిమి
దస్తు మస్తుగు జమీదారాస కెక్కుడే |నాటి బువ్వడగు సన్నాసియాస
నడుము గట్టిన బోయి నడకకు మిక్కిలే | యందలంబెక్కిన యతని పరుగు
పుట్టు వడుగు సేయునట్టి పాటున కంటె | పలువు రాండ్రగు గేస్తు సలుపుపాటు

గీ॥ మంచి చెడ్డల కానవాళ్లెంచి చూడ| కలిమి పేదరికంబులు గావు సుమ్ము
అని పలుకు . . . . . 70