పుట:Chakkatladanda.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ వరి వెన్ను విడిచి కొబ్బరికాయ కాసించు | చీలుకేమిదను ముక్కు చెడుటగాక
గాద టోవిడిచి దిగ్గన నగ్గిపై బడు | మిడుతేమి దినుమంట బడుటకాక
బుట్ట గింజలుమాని బోనులో బడు పంది| కొక్కేమిదిను లోన జిక్కుగాక
చిఱి చేపలను మాని యెర పుర్వునకు బోవు | మీనేమీదిను వ్రయ్యలౌను గాక

గీ॥ తినుచునున్నది విడిచి యింకనొక పెద్ద | తిండి కాసించు పోవునతండు చెడును
అని పలుకు . . . . . 56

సీ॥ బోసి కుక్కకు దొడ్డ ముడుసెమ్ము దొరికిన| గొరుకనేరదు పాసి యుఱకలేదు
ముసలాతనికి నొక్క ముద్దరాల్దొరికిన | కూడ నేరడు పొత్తు వీడలేడు
తిమ్మన చేనొక్క తెంకాయ దొరికిన | కొట్టలేదు విడిచి పెట్టలేదు
కచ్చసానికి బాట కచ్బెరి దొరికిన| పాడనులేదు మాటాడలేదు

గీ॥ తినఁ గలిగిఁనట్టి వారికి దియ్యగూర | లేనివారికి విడువంగలేని యేడ్పు
అని పలుకు . . . . . 57

సీ।। తన యింటి దివ్వె చేతను బట్ట గాలదే ! తనయాలు పడచిన దప్పుగాదె
తాను దీర్పరియైన దగవేద పచ్చునే |తాను ద్రావిన కల్లు పానకంబె
తన కోడి వెన్క దీసిన గెల్పు గల్గునే | తనమేని కంపు నెత్తావి యగునే
తన వెండ్రుకలు గట్ట దంబుర మ్రోగునే | తా బెట్టుకొను పట్టు తప్పనగునే

గీ॥ ఎన్నటికినైన పెరల యందేది యెగ్గు తనకు దానిన యెగ్గుగా దలపపలయు
అని పలుకు . . . . . 58

సీ॥ పొరుగువారికి మేలు పొందరాదంటివా| ఇరుగు వారికి నీవ పొరుగువాడు
ఇరుగు వారికి మేలు హెచ్చరాదంటివా |పారుగువారికి నీవ యిరుగువాడు
ఇరుగు బొరుగును మేలెనయరాదంటివా | యిరుగు బొగ్గునకీవ యిరుగుబొరుగు
ఇరుగు బోరుగు నీవు నెనయ రాదంటివా | ఇంక నెవ్వరికి మేలెనయవచ్చు

గీ॥ ఎల్లరకు మేలుగోరుట చెల్లు గాని | తనకు మేల్పెరలకు గీడు దలపరాదు
అని పలుకు . . . . . 59

సీ॥ తాతి గట్టిన నూయి తప్పదెన్నటికని| యుప్పు నీళ్ళను ద్రావు మొప్పెగలడె
పెద్దలందరు గూడి పెండ్లి చేసి రటంచు | జెడిపె బెండ్లామును జెందగలడె
కట్టుబోతులు వాడ గలరు పెక్కండ్రని | పలికి బెండిలిసేయువాడు గలడె
బావల దీవనల్ బమ్మ దీవనలని | తన యాలి నెరవిచ్చు చెనటి గలడె

గీ॥ కాన రానట్టి యొక బల్మికలదటంచు | కనులకును దోచు గీడెడుర్కొనగలండె
అని పలుకు . . . . . 60