పుట:Chakkatladanda.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


గీ॥ తనకు హెచ్చిన వారలెందాకనుందు | రంతదనుకఁ దనమెప్పులడగియుండు
అని పలుకు . . . . . 51

సీ॥ నెలదప్పినంతనె నిసువు పుట్టగబోదు | నిండదొమ్మిదినెల లుండవలయు
వరినాటినంతనె వడ్లురాలవు పంట | కళ్ళాలదనుకనుఁ గాయవలయు
ప్రోయినిప్పిడగానె బోనంబురాలేదు| వార్చిడించిన దాక నోర్చవలయు
మ్రానుగొట్టంగానే మద్దెలకాలేదు! తొలిచి మూసినదాక నిలువ వలయు

గీ॥ ఎప్పుడెయ్యది కాదగు నప్పుడగును | గాని పూనిన తోడనే కాదు సుమ్ము
అని పలుకు . . . . . 52

సీ॥ క్రొవ్వినజెల్ల నిక్కుచు నీళ్ళమిడిసిన | గట్టుపైఁడుఁ బెద్ద గ్రద్ధనోట
పోతరించినపాము పుట్టెక్కి తలయెత్త | గక్కున గడదేరు గరుడినోట
పొగరుకొన్న పొటేలు తెగిమందబాసిన |వీలు జిక్కు దోడేలుబారి
గుంజబట్టిన నల్లి కోడెక్కి నిలిచిన |గాసిచెందును సొంతగాని చేత

గీ॥ కన్నుగానక నెళవులు గదలిమిట్టి | పడినవారికి నిక్కంబు గొడవ వచ్చు
అని పలుకు . . . . . 53

సీ॥ బోనకత్తెకు దిస్టిబూది బెట్టిననెంత | వచ్చునంతియ రాణి వాసమునకు
కడలికిఁ దియ్యనీర్కట్టి పెట్టిననెంత |వచ్చునంతియ మిన్ను వాక కెన్న
ఆసహెచ్చినవాని కరువదిచ్చిననెఁత |వచ్చునంతియ రాయబారి కెన్న
మరుగుదొడ్డిక నెరమన్ను బూసిననెంత |వచ్చునంతియ పాలగచ్చుగదికి

గీ॥ మొద్దునెప్పుడు తప్పులు దిద్దలేము | తప్పులెరుగనివాని దిద్దంగనేల
అని పలుకు . . . . . 54

సీ॥ వేసాల పేఁడికి మీసాలమర్చిన| మూతిబిగియ బట్టి మొత్తుకొనును
గమిడి బర్రెకు గుడ్డ గంగడోల్కట్టిన |చీదరించుకపట్టిచించి వైచు
కోడితోకకు నొక్క కుంచెగట్టించిన | నెగయనేరక నేల బొగిలిపడును
తుట్టెపుర్వునకొక్క త్రోలుపడగ బెట్ట | దలయెత్త నేరక దన్నుకొనును

గీ॥ ఒకరి వలెనుండవలెనని యొకటిసీయ| నకట నదియెక్క పెనుబాదయగును సుమ్ము
అని పలుకు . . . . . 55