పుట:Chakkatladanda.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ౹౹ సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాడు | గుడిసెవేటును కూడు కోడె దూరు
గొడ్డునంజుడునెత్తి కొనిపోయెడి గొడారి | పనికిమాలినదెత్తు పాకిఁదిట్టు
తగునంచు గంజాయిదమ్ముగొట్టు పిసాసి | కల్లు దావేడి దోసకారి చెప్పు
ఏటేటి దెవసాలకేగు బాపడు పాడె| దాల్పు బాపని నెగతాళిసేయు

గీ॥ తప్పుగలవారు తమతప్పులొప్పుచును | తలచి యొగ్గింత్రుదమకంటె దప్పులాండ్ర
అని పలుకు . . . . . 47

సీ౹౹ వానమిక్కిలెయైన వరదంగలారవు|వరపు మిక్కిలియైన కరవుబెడద
పొడవువానికి నె త్తిబొప్పుల పెనుబాద | పొట్టివానికి నీళ్ళపట్టుగొడవ
ఉ ప్పెక్కువగు దోసెపప్పచ్చిఁ దిన గోడు |చప్పిడి దినగవాచవికినిడుమ
బడబడవాగిన వదురుబోతను దూరు |అరుదు బల్కినమూగయ నెడి కొదువ
 
గీ॥ ఎప్పటికినేని మిక్కిలి మెప్పుపొందు| తప్పదందున నొక కీడు దాపరించు
అని పలుకు . . . . . 48

సీ౹౹ తేలఁ బండిన పండు తియ్యగానేయుండు | వగరెక్కదే కోయ బచ్చికాయ
ముఱగ దున్ని నదమ్ము విరుగ బండునుసుమ్ము | కలయగట్టదు చాలగట్టినేల
మెదిగిన బియ్యము మెరుకుగమ్మదనమ్ము | చేబియ్య పోరెమ్ము సేగిసుమ్ము
ముదిరిన చింతమ్రానది చేవయెక్కును | లేతమొలకవ్రాలుఁ జేత ద్రుంప

గీ॥ పనులగడిదేరినట్టి నేర్పరు నెకాక| కొరవడినవారు పూనిరా చెరుపుగల్గు
అని పలుకు . . . . . 49

సీ౹౹ కుక్కనెక్కి సవారుగొట్టచేర్సినకోతి | గుర్రమెక్కిసవారు గొట్టగలదె
ఈళ్ళజిక్క గబట్టి వెళ్ళించునీర్పెన | లేళ్ళమందల నప్పళించగలదె
చేరునుఁగట్టగూర్చిన చిన్న దారంబు | తేరునుఁబట్టి రాదీయగలదె
ఎద్దుమీదనుకట్ట నేర్పరించినగలత | ఏనుగువీవుతట్టై నయగలదె

గీ॥ ఏదియెంతటి కొనగూడు నెప్పుడేని | దానినంతటి కొనగూర్పదగును సుమ్ము
అని పలుకు . . . . . 50

సీ౹౹ ప్రొద్దుటొడవంగానే పోవు జుక్కలదీటు | ప్రొద్దు గుంకిన వెన్క దద్ద మెరయు
బడిపంతులేదుట గుర్ర డు కాల్గదల్పడు | పంతులు చాటైన బంతులాడు
కడలిపోటైన వెన్కకు బట్టి చనునేరు | పాటై నచోజొచ్చి పారుచుండు
ఆత్తగా రున్న నాళ్ళరవనీరదు కోడ | లాదటజూపు గయ్యాళితనము