పుట:Chakkatladanda.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ తేలు కుట్టినవాని మేలైన వల్లకి | మీద నెక్కించిన బాదలేదె
సంచి బోయినవాని నంచఱెక్కల పాన్పు | పై బండబెట్టిన బాదలేదే
ముక్కు గత్తిని గోసి ముద్దరాల్బెక్కిళ్ళు |మీద ముద్దిడుచున్న బాదలేదె
వది మడుంగుల బర్వుపై నెత్తి పై మేడ |మీద నెక్కించిన బాదలేదె

గీ॥ కస్తి లేనప్పుడింపగు కుస్తరింపు | కస్తికల తఱి మదికింపుగాదు సుమ్ము
అని పలుకు . . . . . 42

సీ॥ దవకనంపు మొలక నెత్తావి గూర్పనే కాని | తగునే తరిగివండ నిగుఱుగూర
కమ్మనావుల పాలు కాఁచి త్రాగనె కాని | తగునే కడవ దొల్పి తానమాడ
చదువరి మాట ఱచ్చల జెల్లునే కాని | తగునె గామి ఖసాయి తగవు దీర్ప
ఇల్లాలు జాణైన నిలు దీర్పనగుగాని | తగునే ఫిరంగీల జగడమాడ

గీ॥ ఎవరినే యక్కరను గుార్తుకెల్ల వారు | వారి నా యక్కరను గూర్పపలయు సుమ్ము
అని పలుకు . . . . . 43

సీ॥ కుందేటికిని లేడి కొమ్మలు రెండిడ్డ |మోర యోరగ జేసి పౌడువ గలదె
బోసికి దుప్పికొమ్మన బండ్ల మర్పిన |గట్టి సెన్గలు కఱకఱనమలునె
గొడ్డు రాలికి జంక బిడ్డ నొక్కనినిడ్డ |గొన గొన పాల్చేపి కుడుప గలదె
మఱుగుజ్జువానికి మఱ్ఱుగాళ్ళు కట్టిన | నొప్పుగా మడచి కూర్చుండ గలడె

గీ॥ తనకు లేనట్టి యందంబు దాల్చుకొన్న| దాన గలిగెడి కర్జమింతయునులేదు
అని పలుకు . . . . . 44

సీ॥ ఏనుగు నెక్కగానే కాడు బలురేడు | ప్రజల కస్తుల నెడ బాపవలయు
మేరిను జంపగానే గాడు సోమాసి | బావలతనివి దీర్పంగ వలయు
ఎగసిత కైక్కగానే కాడు తీర్పరి | అందఱి నొకటిగా నరయ వలయు
ఈటె చేపట్టగానే కడు పోటరి |పులిమీద మార్కొని పొడువ వలయు

గీ॥ జాణనని పూనినంతనే జాణగాడు| ఏర్పడిన పని నెరవేర్చి నేర్పరియగు
అని పలుకు . . . . . 45

సీ॥ తల్లి పొట్టిదియైన బిల్లదా బొడుగైన | ఆ తల్లి కాపిల్లయమ్మ గాదు
బాపండు బడుగైన గాపంద గాడైన |కాపు బాపని మ్రొక్కు గాంచలేడు
కత్తి చిన్నదియైన గాయ పెద్దదియైన |కాయ కత్తిని బట్టి కోయలేదు
పుత్తడి సేరైన ని త్తడి మణుగైన | పుత్తడిత్తడి గుత్త కెత్త నగునె

గీ॥ తక్కు వొక్క వితాన దానెక్కుడైన| నిక్కమున కెప్డు దక్కువ తక్కువయగు
అని పలుకు . . . . . 46