పుట:Chakkatladanda.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


గీ॥ ఎప్పుడెయ్యదిచేసిన నెసగునప్డు |తగును గావింపగా దేని తప్పినడుచు
అని పలుకు . . . . . 37

సీ॥ ఈడిగాతని సారె యాడింప బూన్చిన| గల్లు బుడ్లను వాని కడను విడుచు
ఱంకులాడికిని బేఱంటంబు సెప్పిన | గోర చూపుల మగవారి దనుపు
కొంటె బాతాఖాని గొప్ప కొల్వున నుంప | ఏలినవాని సొమ్మింట జేర్చు
గొట్టె కాపరి గొల్ల గొడ్డు కాపరి జేయ | పాలు పిండుచు గాలు పట్టి యెత్తు

గీ॥ ఎద్ది యెవ్వడు పనుపడు నద్దిసేయ | నొద్ది కగునొండు సేయంగ నోర్వడెందు
అని పలుకు . . . . . 38

సీ॥ కన్నముల్వైచు దొంగలకు బక్కాదగా | కోరు పంచాయతీదారు సుమ్ము
తెగిమండి పడు నగ్గి దేవరకును మంట | గాలి దేవర చెలికాడు సుమ్ము
మాల మాదిగ తందనాల జాత్రకు బంబ | దాసరిమేటి సర్దారు సుమ్ము
మగువ నేడ్పించెడి మగనికి గయ్యాళి| గట్టువాయగు తల్లి పట్టు సుమ్ము

గీ॥ కీడు సలి పెడి వారికి గీడు సలుపు |వారలేతోడు మరి లాతివారు కారు
అని పలుకు . . . . . 39

సీ॥ ప్రాతి పెట్టిన సొమ్ము పయికి లాగినగాని| మారదు బంగారు మాడలయిన
కడుపులో దెవులు నేర్పడగ జాటినగాని| కుదరనేందు రాచ కొమరుడయిన
గాదెలో సరకు లంగడిని బెట్టినగాని| మనవారు కొనరెంత మంచివయిన
మొదవు చంటను బాలు ప్రిదికి దీసినగాని| పనిజేయదది యెట్టి పాడిదై న

గీ॥ నలుగు ఱెఱిగిన వానికే చెలువమెందు| జాటుగా నున్న వానికి దీటులేదు
అని పలుకు . . . . . 40

సీ॥ మొఱయు లేనంతనే మెఱుగై న బంగారు|కంచుకంటేను గ్రించు గాదు సుమ్ము
మెదుకు లేనంతనే మేలైన బాపండు| కాపు కంటెసు లోపుగాడు సుమ్ము
కైపు లేనంతనే కడతావిజవ్వాజి |కాచుకంటెను నీచుగాదు సుమ్ము
కడువీగ నంతినే కమ్మని కొతిమెర | గాదకంటెను బీదగాదు సుమ్ము

గీ॥ విలువ వంగడమును బట్టి కలుగుగాని| అందముల చందముల బట్టి పొందబోదు
అని పలుకు . . . . . 41