పుట:Chakkatladanda.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ కొట్టిలేపిన కోడిగూసినమా త్రాన| నద్దమరేయెట్లు పొద్దుపొడుచు
బిడ్డలాటలకు గొబ్బిళ్ళిడ్డమాత్ర వే| సవినెట్లువచ్చును సంకురాత్రి
చీకటింటను దివ్వెజేర్చినంతనె పట్ట| పగలింట నెట్లు జొప్పడును సందె
పెరటిలో చెట్లెల్ల పురుగుచే మోడైన |రహీవానకారాకు రాలుపగునే

గీ॥ ఎద్ధియెప్పుడు గాదగునద్దియప్పు | డొదవు మనమెంత జేసిననొండుకాదు
అని పలుకు . . . . . 33

సీ॥ పెద్దలందరు గూడి పెండ్లి సేయగబూవ |జోగిసన్నా సికిజుట్టె మెరుపు
మున్నీ ట దోరణమ్ములుకట్ట సమకట్ట | వెదురుగుంజలు బ్రాత గుదురె కరవు
మినపగారెలు వండగను బెట్టజిల్లికి కేలులేనమ్మకు వ్రేలెకొదువ
సాతాని రామానుజయ్య జంగముసేయ | బిలువబోవంగొనె పేరెతప్పు

గీ॥ క్రొత్త పని యొక్కటొనరింప గోరెదేని |కొత్తలోక మరికొన్నిటి గూర్పవలయు
అని పలుకు . . . . . 34

సీ॥ ఇచ్చలేనల్లున కెంతయొడ్డించిన | నీలకూరకు నుప్పు చాలదనును
ఈసుబట్టిన య త్తనేలాగు బొగడిన | ఎగతాళి మాటలకేమి యనును
తనివిదీరని గూళతలయెత్తు బోసిన | జుట్టుమిగిలెనేని కొట్టుకొనును
తగవు మాలిన మొప్పె దప్పుపై బెట్టిన| తప్పు జూచినవాని దన్ను మనును

గీ॥ తగినవారికి మేల్చేయ దగును గాని| తగనివారద్దిచేతురు తారుమారు
అని పలుకు . . . . . 35

సీ॥ కలుద్రావిపాలన్న కల్ల దీని బడాయి | కట్ట లేమే యొక్క గడియలోన
పెరిగిన కడుపులో బిల్లయో బల్లయో | తెలియలేమే రెండు నెలలలోన
ఏటి నీళ్ళుగదోచు నెండమావుల జాడ | యగుపడదే నాల్గడుగులలోన
తెరగ్రుడ్డి పెండ్లి కూతురి మేని పొంకంబు | పట్టలేమే తలఁబ్రాలతరిని

గీ॥ మంచికానిది కొన్నాళ్ళు మరగియున్న| తుదకు నొక్కప్డు నిక్కంబు దోచకున్నె
అని పలుకు . . . . . 36

సీ॥ తరితప్పిపెట్టు విత్తనమెంతమంచిదై ! ననుబాగుపడునని నమ్మరాదు
ముదుసలి కట్టుకొన్నది పైడిబొమ్మయై | ననువలపిడునని నమ్మరాదు
పడుచుసన్నా సెంత వడిగల నేర్పరై | ననుబాళిబడడని నమ్మరాదు
కడుపూవ యెంతటి కావుదీరినదియై | ననుదియ్యనగునని నమ్మరాదు