పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2.సభల్లోమాటలాడాలంటే భయమా?

1.భయం ప్రధాన శత్రువు

      ఇది సమాచారాన్ని అందించే యుగం. మనం జనం ముందు మాట్లాడి వారికి ఆయావిషయాలు తెలియజేయవలసిన అవసరం చాలాసార్లు వస్తుంది. ఐనా చాలా మంది జనం ముందు మాట్లాడాలంటే దడుస్తారు. శక్తి వుండి కూడ భయం వల్ల వెనకాడుతారు. చాలామందికి భయం ప్రబల శత్రువు బెదురువల్లనే సభల్లో నోరు విప్పలేరు. ఐనాభయం చల పర్యాయాలు మనకు ఉపకారమే చేస్తుంది. అది లేకపోతే అపయాల్లో చిక్కుకొని నాశనమైపోతాం. ఐతే ఇది మిదిమీరకూడదు. అమితమైన భయం విజయానికి ఆటంకం. వక్తృత్వ కళను గూర్చి నిపుణూలు కొన్ని సూత్రాలు చెప్పారు. వాటిని పాటిస్తే మనం కూడ మంచి వక్తలం కావచ్చు.

2.భయానికి కారణాలు

      చాలామంది సభల్లో మాటలాడ్డానికి జంకుతారు. దీనికి కొన్ని కారణాలు వున్నాయి. మొదటిది, మనం ఇంతవరకు చేయని ఇప్పుడు క్రొత్తగా చెయడానికి దడుస్తాం. జనం ముందు మాటలాడే అలవాటులేని వాళ్లు అలా మాటలాడడానికి జంకుతారు. వాళ్లకు అదేదో పెద్ద భూతంలాగ కనిపిస్తుంది. కాని మాటలాడ్డం అలవాటు చేసుకొనే కొద్దీ ఈ భయం తగ్గిపోతుంది.
    రెండవది ఆత్మవిశ్వాసం చాలినంతగా లేకపోవడం. నరులు చాలా మంది అంతర్ముఖులు తోడివారితో అట్టే కలవకుండ తమకు తాముగా వుండిపోతుంటారు. సహజంగానే వీళ్లు పదిమంది ముందు నిల్చుంది మాటలాడాలంటే దడుస్తారు. నిప్పుకొడి భయపడినప్పుడు ఇసుకలో తలదూరుస్తుందని చెప్పారు. ఈలాగే ఆత్మవిశ్వాసం లేనివాళ్లు తమలో తాము దాగుకొంటారు. విశేషంగా సభలో గొప్పవాళ్లు వున్నప్పుడు ఈ భయం ఇంకా ఎక్కువౌతుంది. వాళ్లముందు మనం చిన్న నలుసుగా కన్పిస్తాం. ఇక నోటినిండి మాటలు సులువుగా పెకలవు.