పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎదుటలేని మూడో వ్యక్తిని కించపరిచేలా మాట్లాడాతారు. అవాస్తవాలను చెప్తారు. వాళ్లట్టంటా, వీళ్లిట్లంటా అని వదంతులూ పుకార్లూ పుట్టిస్తారు. మూడవవ్యక్తి లోపాలను కొండంతలు చేసి మాట్లాడతారు. వాళ్ల మంచిపేరు చెడగొడతారు. మనం వీళ్ల సుధ్దులను నోరు తెరచుకొని వింటాం. ఈపోచికోలు కబుర్లు వినడంవల్ల మనకేమీ వొరగదు. పైగా అన్యాయంగా ఇతరులను గూర్చి దురభిప్రాయాల ఏర్పరచుకొంటాం.

  వ్యర్ధప్రసంగాలు ఆడవాళ్లు ఎక్కు అగాచేస్తారు. కాని మగవాళ్లలో ఇవి అరుదేమీకాదు ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు చేరిన చోట ఈ ప్రసంగాలు దిడీలున ప్రత్యక్షమౌతాయి.గొప్పవాళ్లు భావాలను గూర్చి మాట్లాడుతారు. ఊసులాటల్లో పాల్గొన కూడదు. ఇవి మన కాలాన్ని నాశం చేస్తాయి మనస్సుని పాడుచేస్తాయి. ఎప్పుడు కూడ ఉన్నత ప్రమాణాలు కల వ్యక్తులతోనే కలుస్తుండాలి. చెత్తరకం నరులతో కలిస్తే మనం కూడ వాళ్ల స్ధాయికి దిగజారిపొతాం.
  విద్యార్ధులు స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. చురుకైన వాళ్లనూ కాలనియమాన్ని పాటించేవాళ్లనూ, హోంవర్కుచేసే వాళ్లనూ దుబార ఖర్చులు పెట్టని వాళ్లనూ స్నేహితులు చేసుకోవాలి. మంచి లక్ష్యాలు కలవారిని మిత్రులను చేసుకోవాలి. సోమరులతోను చెడు అలవాట్లు కలవసరి తోను తిరిగితే అనకు కూడ వారి గుణాలే అలవడతాయి. ఒకే వర్గం పక్షులు కలిసి తిరుగుతాయి. సోమరులు సోమరులనే ఎన్నుకొంటారు. కాని చురుకైన వాళ్లు సోమరులతో కలవరు. మన మిత్రులను బట్టే మనం  ఎలాంటి వాళ్లమో తెలిసిపోతుంది. చౌకబారుజనంతొ కలవ కూడదు. ఉత్తములతో కలసి ఉతములుగా తయారు కావాలి.