పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని కొందరు అనుభవం లేకుండానే సలహాలు ఈయబోతారు. అడకపోయినా అభిప్రాయాలను బాహాటంగా వెలిబుచ్చుతారు. ప్రతిదానికీ ముందు కొచ్చి సలహాలు ఈయబోతారు. వారి సలహలూ సూచనలూ వినేవాళ్లకు ఏమాత్రం ఉపయోగపడవు. మామూలుగా ఎదుటివ్యక్తి అడగకుండానే సలహా ఈయకూడదు. కొన్నిసార్లు తోడివారి ఉచిత సలహాలు మనలను అపమార్గం పట్టిస్తాయి. మనచే చేయగూడని పనులు చేయిస్తాయి. ఉచిత సలహాలను ఇచ్చేవాళ్లను ఒక కంట కనిపెట్టి వుండాలి వారితో సులువుగా కలవగూడదు. ఈ రకం జనం అనుభవం లేకుండానే మాట్లాడుతారు. మన సమస్యను అర్దం జేసికుందానే ఉపదేశం చేస్తారు.వ్యాదిసొకినవాడు నకిలీ డాక్టరు దగ్గరికి పోకూడదు కదా!

5. క్రొత్తను ఆహ్వానించాలి

  అభివృద్ధిని కోరుకొనేవాళ్లు వివిధ రంగాలలో పనిచేసేవాళ్లతో కలవాలి. ఎవ్వరూ ఒకే వర్గంతొ వుండిపోతే క్రొత్త ఆలోచనలు రావు. బావిలో కప్పలా తయారౌతాం.  జీవితం బహు విస్తృతమైనది. నరులు వివిధ రంగాల్లో పనిచేసే వివిధానుభవాలు గడిస్తారు. మనకు తెలిసింది ఒక రంగమే కదా? వేరే రంగాల్లొ పనిచేసే వాళ్లతో కలియడం వల్ల మన దృష్టి విస్తృతమౌతుందు. జ్ఞానము పెరుగుతుంది. చాలమంది విద్యార్దులతో పరిచయ మున్న విద్యార్ది ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకొంటాడు.
  నాణానికి రెండు వైపుల వుంటాయి మామూలుగా మనం నాణెం ఓక్ వైపున మాత్రమే  చూస్తాం. మన భావాలకు భీన్నమైన భావాలు కలవారితో కలిస్తే నాణేం రెండోవైపు కూడా కనిపిస్తుంది. ఎప్పుడూ ఒకే పత్రికను చదవకూడదు. ఒకే రాజకీయ పక్షానికి మద్దతు ఈయ కూడదు. ఒకే మిత్ర బృందంతో వుండిపోకూడదు. ఇతరుల భావాలను కూడ ఆహ్వానించాలి. ప్రాతకు అంటి పెట్టుకొని వుండిపోకూడదు.

5. వ్యర్ధ ప్రసంగాలకు దూరంగా వుండాలి

 కొందరికి వ్యర్ధప్రసంగాలు ఛెయడంలో గొప్ప నేర్పు వుంటుంది. వీళ్లు