పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రేరణం పుడుతుంది. అగ్ని మరొకచోట అగ్నిని పుట్టిస్తుంది. అలాగే ఈ వర్గం జనం వాళ్ల ఉత్సాహాన్ని అన్నివైపుల వెదజల్లుతారు. వీళ్లు చిన్న చిన్న అంశాలను పట్టించుకోరు. ముఖ్యమైన విషయాలమీద మనసు నిల్పుతారు. తమకంటూ ఓ మార్గం ఏర్పరచుకొని ధైర్యంగా ముందుకు సాగిపొతుంటారు. అలాంతి జనులతో కలిస్తే మనకు ఉత్సాహ భావాలు పట్టుబడతాయి. ఉత్సాహం లేందే జీవితంలో ఏ గొప్ప కార్యం సాధించలేం. అది విజయాలు సాధించే వాళ్లుందరూ తప్పక అలవర్చుకొవలసిన దొడ్డగుణం. వ్యతిరేక భావాలు కలవారినుండి తప్పుకొని అనుకూల భావాలు కలవారితొ కలవాలి.

3. అసూయాపరులకు దూరంగా వుండాలి

    ఒక వర్గం ప్రజలకు అసూయ ప్రబలంగా వుంటుంది. వీళ్లకు సామర్జ్యం తక్కువ. సరుకులేదు కనుక విజయాలు సాధించలేదు. ఐనా మదలకుండ కూర్చొరు. విజేతలను చూచి అసూయ చెందుతారు. వారి పనిని ఎలాగైన చెడగొట్టాలని చూస్తారు. వారిని గూర్చి లేనిపోనివి కల్పిస్తారు. పుకార్లు పుట్టిస్తారు. ఎగతాలికి పూనుకొంటారు. అసూయాపరులు అన్ని రంగాల్లోను వుంటారు. ఒక వుద్యోరి పైకొస్తే తోడి వుద్యొగులకు గుర్రు మంటుంది. ఒక వ్యాపారికి లాభమొస్తే తోది వ్యాపారికి కన్నుకుడుతుంది. ఒక్ విద్యార్ది మంచి మార్కులు తెచ్చుకొని టీచరు మెప్పుపొందితే తోడి విద్యార్ధులు సహించలెరు. మరీ కొందరైతే విజేతలను ఎలాగైనా పడగొట్టాలని చూస్తారు. విశేషముగా ఒకేరంగంలొ పనిచేసేవాళ్లు ఆరంగంలో ఒకరు పేరు తెచ్చుకొంటే చాలు సులువుగా అసూయ చెందుతారు. మన మట్టుకు మనం అసూయాపరుల బృందంలో చేరకూడదు. వాళ్లు చెసే వికృత చష్టల్లో భాగస్వాములం కాకూడదు. అసూయ తొడివారికి కీడు చేసే వికృత చేష్టల్లో భాగస్వాములం కాకూడడు. అసూయ తొడివారికి కీడు చేసి వారిని అణగద్రొక్కుతుంది.

4. ఉచిత సలహాలు ఇచ్చేవారితో కలవకూడదు

   మామూలుగా అనుభవము కలవారిని సలహా అడుగుతాం. వారికి జీవితంలొని లోతుపాతులు తెలుసు కనుక మంచి ఉపదేశం అందీయగలరు