పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన స్నేహితులెవరు, మనం ఏలాంటి పుస్తకాలు చదువుతూంటాం అనే విషయాలు చాలా ముఖ్యమైనవి. మన మనసుకి ఏలాంటి భావాలను అందిస్తామొ అలాంటి భావాలనే అది తిరిగి వెలుబుచ్చు తుంది. విత్తొకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా?

2. వ్యతిరేక భావాలు కలవారితో కలవకూడదు

   నరుల మనస్తత్వాలు భిన్నభిన్నంగా వుంటాయి. కొంతమందికి నిరాశాభావాలు వుంటాయి. వీళ్లు దేనికీ ముందుకు రారు. నేను విజయము సాధీంచలేను అని గట్టిగా నమ్ముతారు. ఇక నా గతి యంతే అని వాపొతారు. నానొసట అపజయం వ్రాసిపెట్టి వుంది. ఇక నేనేమి చేయలేను అంటారు. ఎప్పుడు నిరుత్సాహంగా ఆలోచిస్తారు. నిరుత్సాహం గానే మాటలాడుతారు. పుచ్చిపొయిన విత్తనం మొలకెత్తదుకదా! మనసు పాడయిపొయింది కనుక వీళ్లు, జీవితమ్లొ ప్రయోజకులు కాలేరు. ఈలాంటి వాళ్లతో కలిస్తే మనకు కూడ నిరుత్సాహం అంటురొగంలాగ పట్టుకొంటుంది. నదపీనుగులాగ తయారౌతారు. 
   కొందరికి విమర్శనాదృష్టి మెండు వీళ్లు లోకంలో ఎవరినీ మెచ్చుకొరు. ఎవరి పనీ నచ్చరు. ఏ సంస్ధనూ ప్రశంసించరు. అందరి లోపాలను వెదుకుతుంటారు. ఈగ యెప్పుడూ మురికి మీదికి పొతుందే కాని పూవు మీదికి పోదు. జీవితమ్లొ కొంత నలుపు వున్నా తెలుపుకూడా లేకపోలేదు. గులాబీమొక్కకు ముళ్ణున్నా సొగసైన పూలు కూడ వుంటాయి. మనకు కావలసింది చంద్రుని లోని కాంతి కాని మచ్చలు కాదు. విమర్శనా దృష్టి కలవరితొ కలిస్తే జీవితంలో మంచిని చూడలేం. లోపాలు వెదకడం అలవాటైపొతుందు అది మంచిపద్దతి కారు.
    కొందరు బాగా ఉత్సాహంగా వుంటారు. క్రొత్తను ఆహ్వానిస్తారు. పనిచేయడానికి ఇష్టపడతారు. ఏ రంగంలోనైనా విజయాలు సాధించినవాళ్ల జీవితాలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. నేను కూడ ఏదైనా సాధించాలి అనుకోంటారు. నావల్ల ఈ లోకం ఇంతకు పూర్వం వున్నదానికంటె మెరుగుగా తయారు కావాలి అని కోరుకుంటారు. వీరి మాటలు వింటుంటే మనకు కూడ