పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. నీ స్నేహితులు ఏలాంటివాళ్లు?

  నరులు సంఘజీవులు పదిమందితో కలిసి తిరిగేవారు కాని ఎచరితో కలిసి తిరుగుతామో వాళ్ల పోకడలు మనకు కూడా పట్టుబడతాయి. ఈ యంశాన్ని కొంచెం విపులంగా పరిశీలిద్దాం

1.తోడివాళ్లు మన మనసుని ప్రభావితం ఛేస్తారు

         మన శరీరం మనం తినే ఆహారాన్ని బట్టి పనిచేస్తుంది. పుష్టికరమైన పదార్ధాలు తినేవాళ్లు బలంగా వుంటారు. నాసిరకం బోజనం తినేవాళ్లు నీరసంగా వుంటారు. ఇదే సూత్రం మనసుకి కూడ వర్తిస్దుంది. మనసు విచిత్రమైన వస్తువు. దానికి గొప్ప ఆలోచనలు అనే తింది పెడితే అది మనలను ఉత్సాహపరుస్తుంది. మనం గొప్ప కార్యాలు చేసి పదిమంది మెచ్చుకొనే విజయాలు సాధించేలా ఛెస్తుంది. దీనికి భిన్నంగా మనసుకి నీరస భావాలు అనే తిండి పెడితే అది మనలను అధోగరిపాలు చేస్తుంది.
   మనం నిరంతరం తోడినరులతో కలుస్తుంటాం వారి మాటలను వింటుంటాం వారి ఆలొచనలను గమనిస్తుంటాం. వారి పోకడలను చూస్తుంటాం మనకు తెలియకుండానే ఇతరుల ప్రవర్తనం మనలను ప్రభావితం ఛేస్తుంది. అందుకే ఆరునెలలు సహవాసం చేస్తే వరు వీరవుతారు అనే సామెత పుట్టింది. నిజానికి మన అభిరుచులు, విలువలు, ఇష్టాలు, మనం పనిచేసే విదానమూ, నడచే తీరూ మొదలైనవన్నీ ఇతరులనుండి నేర్చుకొన్నవే. మన భావాలు చాలావరకు ఇతరుల భావాలే మన జీవితం ఇతరుల జీవితానినిక్ నకలుగా వుంటుంది.  జీవితంలోని నానా దశల్లో నానా సందర్భాల్లో ప్రక్కవారి నుండి భావాలు స్వీకరిస్తాం ఈ విషయాన్ని అట్లే గమనించం ఇక, ఈ ప్రక్కవారి పద్దతులూ అభిప్రాయాలు ఉన్నత శ్రేణికి చెందినవైతే మన జీవితం కూడ ఉన్నతంగానే వుంటుంది. ప్రక్కవారి దృక్పదాలు లోపాలతో కూడుకొన్నదైతే మన జీవితం కూడ లొపసహితంగానే వుంటుంది. కనుక మనం ఎవరితో కలుస్తుంటాం