పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూడవది, ఒకసారి సభలో మాటలాడబోయి విఫలమయ్యాం, ఆభయం రెండవసారి కూడ మాటలాడనీయదు. మళ్లా అపజయం తెచ్చుకోంటామేమో నని దడుస్తాం. ఒకసారికొట్టిన కుక్క తర్చాత మాటిమాటికి జడుస్తుంది కదా! ఇంకా కొన్ని సార్లు తోడివాళ్లు సభలోమాటలాడబోయి వోడిపోవడం చూశాం వాళ్లు అవమానంతో తలదించుకోవడం గమనించాం మనకు కూడ అదేగతి పడుతుందేమోనని భయపడతాం ఈలాంటి కారణాలు ఇంకా కొన్ని వుడవచ్చు, ఏమైతేనేమి, ఇచ్వి మన వక్తృత్వ కళకు అడ్దువస్తాయి.

3.భయ లక్షణాలు

  సభల్లో మాటలాడ్డానికి భయపడేవాళ్లల్లో కొన్ని లక్షణాలు కన్పిస్తాయి గుండే వేగంగా కొట్టుకొంటుంది. మోకాళ్లు వణకుతాయి. మాటల్లో పునరుక్తి వుంటుంది. కొన్నిసార్లు ఆలోచన శూన్యమైపోయి చుట్టూ చీకటి కమ్మినట్లుగా వుంటుంది. ఏమి మాట్లాడాలోతెలియక  మౌనముగా వుండిపొతాం. మనలను మనం అదుపులో పెట్టుకోలేం. అపజయం, అవమానం తెచ్చుకొన్నట్లుగా వుంటుంది. ఇబ్బందిగావుంటుంది. ఈ లక్షణాలన్నీ అందరిలో కన్పించనక్కరలేదు.

4.భయాన్ని వదలించుకోవాలి

     సభా భయాన్ని Stage Fear  అంటారు. దీన్ని తప్పక వదలించుకోవాలి. భయం నరులకు ప్రభల శత్రువు దీనివల్ల మన శక్తిసామర్ద్యాలు మందగిస్తాయి. విజయం చేజారిపొతుంది. మన భావాలను పదిమంది ముందు ధైర్యంగా స్పష్టంగా చెప్పలేకపోతే చాలా నష్జ్టాలు కలుగుతాయి. మనం సాధించవలసినవి సాదించలేక నిరాశ చెందుతాం. కనుక ప్రయత్నం చేసి సభా భయాన్ని వదలించుకోవాలి. ఒకసారి ఈ రంగంలో విజయాన్ని సాదిస్తే ఆ మీదట వేరే రంగాల్లో కూడ గెలవవచ్చు. ఒక విజయం మరో విజయానికి దారి చూపుతుంది.

5. సభా భయాన్ని తొలగించుకొనే మార్గాలు

   నిపుణులు సబా భయాన్ని తొలగించుకోవడానికి కొన్ని పద్ధతులు సూచించారు.
   1. ఎవరికైనా క్రొత్తపని చేయాలంటే అనిష్టంగాను బెరుకుగాను వుంటుంది.