పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంతవరకు సభలో మాటలాడలేదు. కనుక మనం ఆ పని చేయలేమేమో అనుకొంటాం. దీనివల్ల జంకు ఇంకా బలపడుతుంది. దీనికి విరుగుడు మాటలాడ్డం మొదలుపెట్టడమే ఒకటి రెండుసార్లు మాటలాడాక ఇక ఆ పనికి అలవాటుపడిపోతాం. అలవాతువల్ల భయం కమేణ తగ్గిపోతుందు.

    2.సభాభయం ఒక్క మనకే గాదు. చాలామందికి వుంటుంది. ఉపన్యాసాలను నేర్చుకొనేవాళ్లను పరిశెలించి చూడగా 80 శాతం అభ్యర్ధులు మొదట భయపడ్దారని తేలించి. పేరు మోసిన గొప్ప వక్తలు కూడ మొదట వాళ్లు క్రమేణ ఆ భయాన్ని వదలించుకొన్నాదు. సామాన్య వక్తలు కూడ మొదటి రెండు మూడు వాక్యాలు చెప్పిందాకా తమను కొంత భయం వుంటుందనీ ఆ మీదట అది పొతుందనీ చెప్తుంటారు.  దీన్ని బట్టి మనం కూడ ఈ బెదురును ప్రయత్నం చేసి తొలగించుకోవచ్చునని గ్రహించాలి. ఇంకో  విషయం కూడ ఏ పనిలోనైనా కొద్దిపాటి భయం మంచిదే దీనివల్ల పనిని మనసుపెట్టి చేస్తాం. ఎక్కువ ఫలితాన్ని అర్దిస్తాం అసలు ఏ భయం లేకపోతే అపాయం తెచ్చుకొంటాం కనుక భయం మనకు కొంతవరకు ఉపకారమే చేస్తుంది. దీనివల్ల ఉపన్యాసాన్ని చక్కగా తయారు చేసికొంటాం కూడ. ఇతర వక్తలు కూడ భయపడతారని తెలుసుకొన్నతర్వాత మన భయం కొంతవరకు తగ్గుతుంది.
   3. మొదటలో మనము కొంత పరిచస్యమూ ఆసక్తీవ్చున్న అంశాలను ఎన్నుకొని మాటలాడాలి. అ విషయాలు మనకు ముందుగానే తెలుసు కనుఇక వాటిని గూర్చి సులువుగానే మాటలాడగలుగుతాం. ఆ పిమ్మట మనకు అనుభవము లేని నూత్న విషయాలమీద గూడ ఉపన్యాసాలు ఈయవచ్చు. మొదటలో కొన్ని పొరపాట్లు చేసినా పరవాలేదు. మనం ఏ పనీ నిర్దుష్టంగా చేయలేం. పరిపూర్ణత అనేది భగవంతుని గుణంకాని నరుల గుణం కాదు.
   4. ఉపన్యసించకముందు మనలను గూర్చి మనం ఆలోచించకూడదు. నేను సరిగా మాటలాడలేనేమో సభ్యులు నవ్వుతారేమో, నేను అవమానం తెచ్చుకొంటా నేమో మొదలైన ఆలోచనలను మనసులోకి రానీయ కూడదు.