పుట:Chaitanya Deepam - Fr. Jojayya.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీటివల్ల మన శక్తి నశిస్తుంది. మనలను గూర్చి కాక, మన వుపన్యాసం వినే సభ్యులను గూర్చి ఆలోచించాలి ఏయే విషయాలు చేస్తే వాళ్లకు బాగా నచ్చుతుంది. వాళ్లకు ఆసక్తి కలిగించడం ఏలాగ, వారికి ఆలోచన పుట్టించడం ఏలాగ- మొదలైన విషయాలను గూర్చిఆలోచించాలి దీనివల్ల ఉపన్యాసాన్ని బాగా తయారు చేసికొంటాం ఇంకో విషయం మన ఉపన్యాసాన్ని వినే సభ్యుల్లో ఎవరనా గొప్పవాళ్లుంటే మనం ఇంకా అధికంగా భయపడతాం నేను తక్కువవాణ్ణి అనుకొంటాం. కాని ఎవరిగొప్ప వాళ్లకే వుంటుంది. మనలో కూడ కొన్ని గొప్పగుణాలు వుండవచ్చు కదా! ఈలాంటి ఆలోచనలతో మన భయాన్ని వదిలించుకోవాలి.

  5. నేను మంచి వక్తగా పేరుతెచ్చుకోంతాను అని వూహించుకొని ఆ వూయాచిత్రాన్ని మన మనసు ముందు నిల్చుకోవాలి. ఆ చిత్రాన్ని రోజూ చాలసార్లు జ్ఞప్తికి తెచ్చుకోవాలు  మానసిక శాస్త్రజ్నులు ఈ లాంటి ఊహా చిత్రాల ద్వారా కూడ కార్యాలు నెరవేర్చి విజయాలు సాధించవచ్చునని చెప్పారు.
  6. ఉపన్యాసాన్ని ముందుగా చక్కగా తయారు చేసుకోవాలి. ఉపన్యాసంలో భావాలు, అంశాలు బలంగా వుండాలి. వట్టి మాటలు చాలవు. ఎన్ని అంశాలున్నాయో అంత బలంగా ఉపన్యాసం రాణిస్తుంది. శ్రోతలకు ఆసక్తి కలిగించే అంశాలు చెప్పాలి. ఉదాహరణలూ సంఘటనలూ, స్వీయ అనుభవాలూ ఉటంకించాలి. ఇవన్నీ ఓ క్రమపద్దతిలో రావాలి. ఉపన్యాసాన్ని కంఠత: నేర్చుకో నక్కరలేదు. మన ఉపన్యాసాన్ని ముందుగానే స్నేహితులకు విన్పించి వాళ్ల అభిప్రాయాన్ని వినడం గూడ మంచిది. సభలో మాటలాడేటప్పుడు మన శరీరం, అవయవాలు సాఫీగా వుండాలి కాని ముడుచుకొని పోకూడదు. స్వరం స్సహజంగా వుండాలి. బాగా తయారుచేసికొన్న ఉపన్యాసం మామూలుగా విజయవంతమౌతుంది. ఏ కారణం చేతనైనా సరే ఉపన్యాసం, రాణించకపోతే రెండవసారి మాటలాడేటప్పుడు పూర్వపు లోపాలను సరించుకోవాలి., ఎప్పుడు మనలను మనమే చక్కదిద్దు కొంటుండాలి. క్రమేణ ఉపన్యాస కళలో అనుభవమూ అభివృద్ది గురించి ఆరితేరుతాం